చిత్తూరు జిల్లా వాసులను వణికించిన ఏనునుగు బంధించేందుకు అటవీ శాఖ అధికారులు చేపట్టిన ఆపరేషన్ గజ సక్సెస్ అయ్యింది. గురువారం రామాపురంలోని ఓ చెరుకు తోటలో వున్న ఏనుగుకు విజయవంతంగా మత్తు ఇంజెక్షన్ ఇచ్చారు.

చిత్తూరు జిల్లా వాసులను వణికించిన ఏనునుగు బంధించేందుకు అటవీ శాఖ అధికారులు చేపట్టిన ఆపరేషన్ గజ సక్సెస్ అయ్యింది. రామాపురం వద్ద గురువారం మధ్యాహ్నం ఏనుగును బంధించారు అటవీ శాఖ అధికారులు. ఈ గజరాజం స్వైర విహారం చేస్తూ రెండ్రోజుల్లో ముగ్గురిని తొక్కి చంపింది. దీంతో ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతికారు. సమాచారం అందుకున్న అటవీ శాఖ సిబ్బంది ఏనుగును బంధించేందుకు ఏర్పాట్లు చేసింది. ఈ క్రమంలో గురువారం రామాపురంలోని ఓ చెరుకు తోటలో వున్న ఏనుగుకు విజయవంతంగా మత్తు ఇంజెక్షన్ ఇచ్చారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.