తూర్పుగోదావరి జిల్లా కాట్రేనికోన మండలం ఉప్పూడి వద్ద ఓఎన్‌జీసీ గ్యాస్ పైప్‌లైన్ లీకవ్వడంతో పరిసర గ్రామాల ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు. భారీగా గ్యాస్ లీక్ అవుతుండటంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు.

సమాచారం అందుకున్న పోలీస్, రెవెన్యూ, అగ్నిమాపక శాఖ అధికారులు ఘటనాస్థలికి చేరుకుని ప్రజలను ఆ ప్రాంతం నుంచి ఖాళీ చేయించారు. గ్యాస్ లీకవుతున్న ప్రదేశానికి కేవలం 50 మీటర్ల దూరంలోనే కాట్రేనికోనకు వెళ్లే రహదారి ఉండటంతో రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేశారు.

మరోవైపు గ్యాస్ లీక్ వ్యవహారాన్ని అధికారులు రాజమహేంద్రవరంలో ఉన్న ఓఎన్‌జీసీ అధికారులకు అందించారు. ఈ పైప్‌లైన్ నిర్వహణ బాధ్యతలను ఓఎన్‌జీసీ.. పీహెచ్ఎఫ్ అనే సంస్థకు అప్పగించింది. ఈ క్రమంలో ఆ కంపెనీ సిబ్బంది నిర్వహణ పనులు చేపడుతున్న క్రమంలో ఈ ఘటన జరిగింది. 

Also Read:

ఎప్పుడో చెప్పాం: ఏపీకి ప్రత్యేక హోదాపై మరోసారి తేల్చేసిన జీవీఎల్

నారావారిపల్లెలో ఉద్రిక్తత: ఎమ్మెల్యే చెవిరెడ్డి సభ, టీడీపీ నిరసన

చైనాలో చిక్కుకొన్న తెలుగు టెక్కీ జ్యోతి: ఇండియా ఫ్లైట్ ఎక్కకుండా అడ్డుకొన్న అధికారులు