Asianet News TeluguAsianet News Telugu

ఎప్పుడో చెప్పాం: ఏపీకి ప్రత్యేక హోదాపై మరోసారి తేల్చేసిన జీవీఎల్

మౌలిక వసతుల కల్పనకు ఏపీ నుంచి సరైన ప్రతిపాదనలు రాలేదని బిజెపి ఎంపీ జీవీఎల్ నరసింహా రావు అన్నారు. పోలవరం ప్రాజెక్టుపై పెట్టిన ఖర్చు యూసీలు ఇంకా రావాల్సి ఉందని జీవీఎల్ తెలిపారు.

GVL Narasimha Rao reacts on Special category status to AP
Author
New Delhi, First Published Feb 2, 2020, 10:08 AM IST

న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో ప్రతిపాదించిన బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అన్యాయం జరిగిందనే విమర్శలపై బిజెపి రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు స్పందించారు. రాష్ట్రాల అంశాల ప్రాతిపదికన కేంద్ర బడ్జెట్ ను చూడడం సరి కాదని ఆయన శనివారంనాడు అన్నారు. 

అమరావతిలో ఐఐసీహెచ్ ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రిని కోరనున్నట్లు ఆయన తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి సహకరించి ముందుకు వెళ్లాలని ఆయన అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయమేనని గతంలో చెప్పామని ఆయన గుర్తు చేశారు. రాజకీయంగా వాడుకోవడానికే ప్రత్యేక హోదాను ముందుకు తెస్తున్నారని ఆయన అన్నారు. 

also Read: కేంద్ర బడ్జెట్ 2020: వైఎస్ జగన్ పై నిందలు వేసిన పవన్ కల్యాణ్

జమ్మూ కాశ్మీర్, లడక్ లకు ఇచ్చినట్లే ఏపీకి ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చామని ఆయన చెప్పారు పోలవరానికి నాబార్డు ద్వారా కేంద్రం నిధులు సమకూరుస్తుందని చెప్పారు రాష్ట్ర ప్రభుత్వాల ప్రతిపాదనల మేరకు మౌలిక వసతుల కల్పన చేపట్టినట్లు ఆయన తెలిపారు. 

ఆశించిన స్థాయిలో రాష్ట్రం నుంచి ప్రతిపాదనలు రాలేదని తమకు సమాచారం ఉందని, పోలవరానికి రాష్ట్రం ప్రభుత్వం పెట్టిన ఖర్చుకు యూసీలు ఇంకా రావాల్సి ఉందని చెప్పారు. బడ్జెట్ లో ఆదాయం పన్ను శాతాన్ని తగ్గించడం చారిత్రాత్మక నిర్ణయమని ఆయన అన్నారు. 

Also Read: ఏపీకి కేంద్రం మొండి చేయి: బడ్జెట్‌పై వైసీపీ ఎంపీ విజయ సాయిరెడ్డి విమర్శలు

Follow Us:
Download App:
  • android
  • ios