టీడీపీకి మరో సీనియర్ నేత రాజీనామా.. బుజ్జగిస్తున్న చంద్రబాబు

one more senior leder resignation to tdp
Highlights

చంద్రబాబుకి మరో షాక్

టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడికి మరో షాక్ తగిలింది.టీడీపీ సీనియర్ నేత గోగుల బ్రహ్మయ్య  పార్టీకి రాజీనామా చేశారు. అయితే.. చంద్రబాబు ఆయనను బుజ్జగించి మరీ.. ఆయన రాజీనామాను తిరస్కరించారు.

గోగుల బ్రహ్మయ్య.. ఖమ్మం జిల్లా లీగల్ సెల్ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు. కాగా.. ఆయన ఇటీవల పార్టీ అధ్యక్షునికి తన రాజీనామాను అందజేశారు.  అయితే..30 ఏళ్లుగా పార్టీకి కంకణబద్ధుడై ఎన్‌టీఆర్‌ అభిమానిగా ఉన్న బ్రహ్మయ్య రాజీనామాను తాము తిరస్కరిస్తున్నామని, ఆయన సేవలు పార్టీకి చాలా అవసరమని టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు, రాష్ట్ర లీగల్‌ సెల్‌ అధ్యక్షుడు గందం గురుమూర్తి పేర్కొన్నారు. 

ఇదే విషయాన్ని వివరిస్తూ రాష్ట్ర లీగల్‌ సెల్‌ ప్రధాన కార్యదర్శి గొల్లపూడి రామారావుతోపాటు బ్రహ్మయ్యకు రిజెక్ట్‌ లెటర్‌ పంపించారు, ప్రస్తుత పరిస్థితుల్లో పార్టీకి సేవలందించేవారి అవసరం ఎంతైనా ఉందని, నాయకులంతా సమన్వయంతో కలిసి పని చేసి పార్టీని ముందుకు తీసుకెళ్లాలని వారు ఆకాంక్షించారు. కాగా... రాజీనామా తిరస్కరణ పట్ల బ్రహ్మయ్యను వివరణ కోరగా అధిష్ఠానం నిర్ణయానికి తాను కట్టుబడి ఉంటానన్నారు. 

చంద్రబాబునాయుడు తనపై నమ్మకం, పార్టీ నాయకుల కోరిక మేరకు తాను టీడీపీలో ఉంటానని, లీగల్‌ సెల్‌ అధ్యక్షుడిగా కొనసాగుతానని తెలిపారు. బ్రహ్మయ్య రాజీనామా తిరస్కరణ పట్ల రాష్ట్ర లీగల్‌ సెల్‌ నాయకులు కాళ్లూరి లక్ష్మీనర్సింహారావు, చిన్నాల శ్రీనివాసరావు, అక్బర్‌ పాషా, మువ్వా నాగేశ్వరరావు, తోటకూరి శ్రీనివాసరావు, కాళ్లూరి రాధాకృష్ణ, వెలమాటి శ్రీనివాసు, ఉన్నం వెంకటేశ్వర్లు, నాగటి రాము, బెందడపు కుమార్‌, జీవీ లక్ష్మీనారాయణ, లక్ష్మీనర్సింహారావు హర్షం వ్యక్తంచేశారు.

loader