తిరుపతిలో విషాదం చోటు చేసుకుంది. కరోనా బారినపడిన భార్యాభర్తలు ఆసుపత్రికి వెళుతుండగా గుండెపోటుతో మరణించారు. వివరాల్లోకి వెళితే మదనపల్లికి చెందిన భార్యాభర్తలకు కరోనా పాజిటివ్‌గా నిర్థారణ కావడంతో మంగళవారం వీరిని ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు అంబులెన్స్ వచ్చింది.  

ముందుగా భార్య వెళ్లి అంబులెన్స్‌లో కూర్చొంది. అయితే తాను ఆసుపత్రికి వెళ్లేదే లేదని భర్త భీష్మించుకుని కూర్చొన్నాడు. బంధువులు నచ్చజెప్పినప్పటికీ వినకపోవడంతో అతనిని బలవంతంగా అంబులెన్స్‌లో కూర్చొబెట్టే ప్రయత్నం చేశారు. ఇంతలో ఆయనకు గుండెపోటు వచ్చి చనిపోయాడు. కళ్లెదుటే భర్త చనిపోవడాన్ని చూసిన భార్యకు కూడా గుండెపోటు వచ్చి చనిపోయింది.