పంచాయతీ ఎన్నికలపై ఏపీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ వీడియో కాన్ఫరెన్స్ ప్రారంభమైంది. అయితే ఈ కాన్ఫరెన్స్‌కు సీఎస్, డీజీపీ, పంచాతీరాజ్ శాఖ ఉన్నతాధికారులు డుమ్మా కొట్టడం ఇప్పుడు చర్చనీయాంశమైంది

పంచాయతీ ఎన్నికలపై ఏపీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ వీడియో కాన్ఫరెన్స్ ప్రారంభమైంది. అయితే ఈ కాన్ఫరెన్స్‌కు సీఎస్, డీజీపీ, పంచాతీరాజ్ శాఖ ఉన్నతాధికారులు డుమ్మా కొట్టడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్, డీజీపీ గౌతమ్ సవాంగ్, పంచాయతీరాజ్ శాఖ ఉన్నతాధికారులు వీడియో సమావేశానికి హాజరు కాలేదు. ప్రభుత్వం పంచాయతీ ఎన్నికల నిర్వహణను వ్యతిరేకిస్తున్న ప్రస్తుత సందర్భంలో వారి గైర్హాజరీ ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. 

జిల్లా అధికారులు సైతం ఈ వీడియో కాన్ఫరెన్స్‌కు హాజరుకాలేదు. శ్రీకాకుళం, తూర్పుగోదావరి, కృష్ణా, అనంతపురం, ప్రకాశం, కడప, గుంటూరు జిల్లాల అధికారులు భేటీకి హాజరుకాలేదు. ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారం సాయంత్రం 3 గంటల నుంచి 5 గంటల వరకు వీడియో కాన్ఫరెన్స్ జరగనుంది. జిల్లా అధికారుల కోసం నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎదురు చూస్తున్నారు.

దీనికి అనుగుణంగానే జిల్లా కలెక్టర్లు, ఇతర అధికారులకు ముందుగానే సమాచారమిచ్చారు. ఇవాళ పంచాయతీ ఎన్నికలకు నిమ్మగడ్డ షెడ్యూల్ విడుదల చేయడంతో నామినేషన్ల స్వీకరణ, ఉపసంహరణ ఏర్పాట్లు చేయాల్సి వుండటంతో క్షేత్రస్థాయిలో అధికారులను సిద్ధం చేసేందుకు నిమ్మగడ్డ ఈ వీడియో కాన్ఫరెన్స్ ఏర్పాటు చేశారు.

Also Read:తొలి దశ నోటిఫికేషన్ జారీ : ఏపీ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ ఇదీ....

అయితే సమావేశానికి ఎందుకు హాజరు కాలేదని ప్రశ్నిస్తే.. టెక్నికల్ ఎర్రర్ అంటూ అధికారులు దాటవేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో నాలుగు విడతల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌ శనివారం ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల చేసిన విషయం తెలిసిందే.

ఫిబ్రవరి 5, 9, 13, 17 తేదీల్లో పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. కాగా, ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్‌ విడుదలైంది. శనివారం రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్‌ను విడుదల చేశారు.

రెవెన్యూ డివిజన్‌ ప్రాతిపదికగానే ఎన్నికలు జరుగుతాయని వెల్లడించారు. తొలి దశలో విజయనగరం, ప్రకాశం జిల్లాలు మినహా మిగిలిన 11 జిల్లాల్లో ఎన్నికలు ఉంటాయని పేర్కొన్నారు.