అధికారులు ఎవ్వరినీ లెక్క చేయటం లేదు. చివరాఖరికి ముఖ్యమంత్రి అన్నా లెక్కేలేదు. అందుకు తాజాగా జరిగిన ఓ ఘటనే నిదర్శనం.

అధికారులు ఎవ్వరినీ లెక్క చేయటం లేదు. చివరాఖరికి ముఖ్యమంత్రి అన్నా లెక్కేలేదు. అందుకు తాజాగా జరిగిన ఓ ఘటనే నిదర్శనం. సోమవారం వెలగపూడిలోని సచివాలయంలో ఉన్నత విద్యాశాఖ ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. సరే, సమావేశమంటే ముందు స్నాక్స్ ఉంటాయి కదా? సమావేశానికి హాజరైన వాళ్ళు స్నాక్స్ తినేసి అక్కడే ఉన్న ఓ ఫొటోమీద పడేసారు. ఇంతకీ వారు పెట్టినది ఎవరి ఫొటో మీదంటే చంద్రబాబునాయుడు ఫొటో మీద. గోడకు ఉండాల్సిన ఫొటో క్రిందకు ఎందుకు వచ్చిందో తెలీదు కానీ మొత్తానికి టీపాయ్ పైనున్న ముఖ్యమంత్రి ఫొటో మీద తిన్నప్లేట్లను పడేసారు. దాంతో విషయం ఆనోటా ఈనోటా చంద్రబాబుకు చేరింది. వెంటనే విచారణకు ఆదేశించారు.