ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ప్రభుత్వం అదనపు భద్రతను కల్పించింది. మూడు రాజధానుల ప్రకటనతో రాష్ట్రంలో ఉద్రిక్త పరిస్ధితులతో పాటు నిఘా ఏజెన్సీల నివేదికల నేపథ్యంలో సీఎంకు ఆక్టోపస్ భద్రతను కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

Also Read:రాజధాని అంటే చంద్రబాబు చెప్పినట్లు సంపదసృష్టే...కానీ అలా కాదు: అంబటి సెటైర్లు

దీంతో 30 మంది సభ్యులతో కూడిన ఆక్టోపస్ బృందం ముఖ్యమంత్రి కోసం రంగంలోకి దిగింది. ఈ క్రమంలో బుధవారం నుంచి తాడేపల్లిలోని సీఎం నివాసం వద్ద విధులు చేపట్టింది. ఆరుగురు సభ్యుల చొప్పున ఐదు బృందాలుగా సీఎం ఏ కార్యక్రమానికి వెళ్లినా ఆక్టోపస్ క్లోజ్డ్ సర్క్యూట్‌లో గట్టి భద్రత కల్పించనుంది.

Also Read:రాజధానిని మారుస్తామంటే కేంద్రం చూస్తూ ఊరుకోదు: సుజనా హెచ్చరిక

ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్‌తో కలిసి ఈ విభాగం పనిచేస్తుంది. హోం సెక్రటరీ, డీజీపీ, లా అండ్ ఆర్డర్ ఐజీ, ఇంటెలిజెన్స్ చీఫ్‌లతో కూడిన కమిటీ సీఎంకు ఆక్టోపస్‌ భద్రత కల్పించాలని సిఫార్స్ చేసింది. 

* OCTOPUS అంటే ఆర్గనైజేషన్ ఫర్ కౌంటర్ టెర్రరిస్ట్ ఆపరేషన్స్
* ఆంధ్రప్రదేశ్ పోలీసుల్లోని మెరికల్లాంటి యువకులను ఎంపిక చేసి.. వారికి అత్యున్నత కఠిన శిక్షణ ఇచ్చి ఈ దళాన్ని ఏర్పాటు చేశారు. 
* మొన్నటి వరకు ఎస్‌పీఎఫ్ పోలీసులతో పాటు గన్‌మెన్లు ముఖ్యమంత్రి జగన్‌‌కు భద్రత పర్యవేక్షించేవారు.