విశాఖపట్నం: సినీ నిర్మాత నూతన్ నాయుడి భార్య మధుప్రియను పోలీసులు మళ్లీ అరెస్టు చేశఆరు బెయిల్ మీద విడుదలైన కొద్ది గంటలకే ఆమెను పోలీసులు అరెస్టు చేశఆరు తూర్పు గోదావరి జిల్లాకు చెందిన ఓ వ్యక్తి నుంచి మధుప్రియ రూ.25 లక్షలు వసూలు చేశారని పోలీసులకు ఫిర్యాదు అందింది.

దాంతో మధుప్రియపై పోలీసులకు ఫిర్యుదు చేశారు. ఈ నెల 20వ తేదీ వరకు ఆమెకు కోర్టు రిమాండ్ విధించింది. ఇదిలావుంటే, విశాఖపట్నం సుజాత్ నగర్ లోని నూతన్ నాయుడి ఇంట్లో ఆగస్టు 20వ తేదీన ఓ దళిత యువకుడికి శిరోముండనం చేయించిన ఘటన సంచలన సృష్టించిన విషయం తెలిసిందే. 

నూతన్ నాయుడి నివాసంలో గిరిప్రసాద్ నగర్ కు చెందిన శ్రీకాంత్ పనిచేసి మానేశాడు. ఆ ఇంటికి వచ్చిన బ్యుటిషియన్ సెల్ ఫోన్ హ్యాక్ చేసి అసభ్యంగా ప్రవర్తివంటూ శ్రీకాంత్ ను భద్రతా సిబ్బంది, నూతన్ నాయుడి భార్య దుర్భాషలాడారు. అతనికి శిరోముండనం చేశారు.

శిరోముండనం ఘటనపై శ్రీకాంత్ పెందుర్తి పోలీసులకు ఫిర్యాదు చేశఆరు ఈ కేసులో మధుప్రియ, నూతన్ నాయుడులతో పాటు మరింత మందిని పోలీసులు అరెస్టు చేశారు.