గుంటూరు: విశాఖపట్నం పెందుర్తిలో దళిత యువకుడి శిరోముండనం కేసులో సినీ నిర్మాత నూతన్ నాయుడిని ఎందుకు అరెస్టు చేయలేదని తెలుగుదేశం పార్టీ (టీడీపీ) నాయకుడు, మాజీ మంత్రి నక్కా ఆనందబాబు ప్రశ్నించారు. నూతన్ నాయుడు వైసీపీ సిద్ధాంతకర్త కాబట్టే చర్యలు తీసుకోవడం లేదని ఆయన విమర్శించారు. 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దళితులపై దాడులను నిరసిస్తూ టీడీపీ రాష్ట్రవ్యాప్తంగా ఆదివారంన నిరసలు చేపట్టింది. ఈ సందర్భంగా నక్కా ఆనందబాబు ఆ వ్యాఖ్యలు చేశారు. వైసీపీ అధికారంలోకి రావడానికి కృషి చేసిన దళితులపైనే కక్ష కట్టడం దారుణమని ఆయన అన్నారు. 

Also Read: విశాఖ శిరోముండనం బాధితుడు శ్రీకాంత్‌కి బాబు ఫోన్: అండగా ఉంటామని హామీ

దళితుల ఓట్లతోనే గెలిచి వారిపైనే దాడులు చేయడం దారుణమని ఆయన అన్నారు. దళితులపై వరుస ఘటనలకు నిరసనగా గుంటూరులో దీక్షకు దిగారు. ఎస్సీల పట్ల పాలక పక్షం దూర్మార్గంగా వ్యవహరిస్తోందని విజయవాడు తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు విమర్శించారు 

ఇదిలావుంటే, విశాఖపట్నంలోని పెందుర్తిలో గల నూతన్ నాయుడి నివాసంలో శ్రీకాంత్ అనే యువకుడికి గుండు గీయించిన ఘటన తీవ్ర సంచలనం సృష్టించింది. ఈ ఘటనలో పోలీసులు నూతన్ నాయుడి భార్య మధుప్రియతో పాటు ఏడుగురిని అరెస్టు చేశారు. 

Also Read: నూతన్ నాయుడి ఇంట్లో శిరోముండనం: పవన్ కల్యాణ్ జనసేన హెచ్చరిక