ఇప్పటి వరకూ ‘ఎన్టీఆర్’ అంటే నందమూరి తారక రామారావు అనే అందరికీ తెలుసు. కానీ ఎన్టీఆర్ కొడుకు, టిడిపి నేత నందమూరి హరికృష్ణ మాత్రం కొత్త అర్ధం చెప్పారు. ఇంతకీ అదేంటంటే ‘నేషనల్ టైగర్ ఆఫ్ రిఫార్మ్స్’ అని. ‘దేశంలో ఏ ప్రభుత్వం అనుసరిస్తున్న సంక్షేమ పథకాలైనా ఒకపుడు ఎన్టీఆర్ అమలు చేసినవే’ అన్నారు. ప్రభుత్వాలు మారుతున్నా, రూపు మారుతున్నా, పేర్లు కొత్తగా పెడుతున్నా...ప్రభుత్వాలు మాత్రం ఎన్టీఆర్ ప్రవేశపెట్టినవే అంటూ తెలిపారు.

టిడిపి పుట్టుకే ఓ సంచలనమైతే జాతీయ స్ధాయిలో ఎన్టీఆర్ పాత్ర కూడా అప్పట్లో పెద్ద సంచలనంగా హరికృష్ణ అభివర్ణించారు. పూజ్య బాపూజీ, అంబేద్కర్, ప్రకాశం పంతులు, పొట్టి శ్రీరాములు లాంటి మహనీయుల కలయికే ఎన్టీఆర్ అని చెప్పారు. ఎన్టీఆర్ పుట్టినరోజు మే 28 ప్రతీ తెలుగింటా ఓ పుట్టినరోజైతే, వర్ధంతి రోజైన జనవరి 18  మాత్రం ప్రతీ తెలుగింటా ఓ విషాధ దినంగా హరికృష్ణ వర్ణించారు.