ఎన్ఆర్ఐ మురళి హత్య కేసు: పోలీసుల అదుపులో మురళి భార్య, ప్రియుడు
ఎన్ఆఐ మురళి హత్య కేసులో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుుకున్నారు. మురళి భార్య మృదులతో పాటు ప్రియుడు హరిశంకర్ వర్మను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఈ విషయమై వీరిద్దరిని ఈ హత్య కేసు గురించి లోతుగా విచారణ చేస్తున్నారు.
విశాఖపట్టణం: NRI మురళి హత్య కేసులో మురళి భర్తతో పాటు ఆమె ప్రియుడు హరిశంకర్ ను కూడా అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నామని Visakhapatnam పీఎం పాలెం పోలీసులు చెప్పారు. విశాఖపట్టణానికి చెందిన Murali విదేశాల్లో ఉంటున్నాడు. విదేశాల నుండి వచ్చిన కొన్ని రోజులకే ఆయన హత్యకు గురికావడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ప్రియుడి మోజులో భర్త మురళిని భార్య మృదుల హత్య చేసిందని PM Palem సీఐ తెలిపారు.
ఈ నెల 17వ తేదీన Mrudula అనే మహిళ తమ వద్దకు వచ్చి తన భర్త కన్పించడం లేదని ఫిర్యాదు చేసిందన్నారు. ఈ విషయమై ఆమె చెప్పిన మాటల్లోనే తమకు అనుమానం వచ్చిందని పోలీసులు చెప్పారు. ఈ విషయమై మృదుల ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తే కీలక విషయాలు వెలుగు చూసినట్టుగాCI తెలిపారు.
Srikakulam లో ఉన్న తన తల్లిదండ్రులను కలిసేందుకు ఈ నెల 11న విశాఖపట్టణం బయలుదేరిన మురళి కన్పించకుండా పోయారని మృదుల తమకు ఫిర్యాదు ఇచ్చిందని Police లు చెప్పారు.. ఈ విసయమై తాము విచారణ చేస్తే కీలక విషయాలు తెలిశాయన్నారు మృదులకు హరిశంకర్ వర్మతో వివాహేతర సంబంధం ఉందని తేలిందన్నారు.ఈ దిశగా విచారణ చేస్తే మురళి హత్య విషయం వెలుగు చూసిందని పోలీసులు చెప్పారు. ప్రియుడితో వివాహేతర సంబంధానికి భర్త మురళి అడ్డుగా ఉన్నందున ఆయన అడ్డు తొలగించుకొనేందుకు మృదుల ప్లాన్ చేసిందని పోలీసులు వివరించారు.
ప్రియుడితో కలిసి భర్త మురళి తలపై కుక్కర్ తో కొట్టి మృదుల హత్య చేసిందని పోలీసులు తెలిపారు. ఆ తర్వాత శవాన్ని గోనెసంచిలో మూట గట్టి మారికవలస బ్రిడ్జి వద్ద వేశారని సీఐ చెప్పారు. మురళి డెడ్ బాడీని గుర్తించకుండా ఉండేందుకు గాను పెట్రోల్ పోసి దగ్దం చేశారని పోలీసులు తెలిపారు. మురళి హత్య కేసు విషయమై హరిశంకర్ తో పాటు మృదులను అదుపులోకి తీసుకున్నామని సీఐ తెలిపారు.
also read:విశాఖలో దారుణం.. కుళ్లిన స్థితిలో మృతదేహం.. వీడిన మర్డర్ మిస్టరీ..?
మృదులతో ఎనిమిదేళ్ల క్రితం మురళికి వివాహమైంది. ఉద్యోగ నిర్వహణ కోసం మురళి ఆఫ్రికాలో ఉంటున్నాడు. అయితే భర్త లేని సమయంలో మృదులకు Harishankar varmaతో ఏర్పడిన పరిచయం వివాహేతర సంబంధానికి దారి తీసిందని పోలీసులు గుర్తించినట్టుగా ప్రముఖ తెలుగు న్యూస్ చానెల్ ఎన్టీవీ కథనాన్ని ప్రసారం చేసింది.