విశాఖపట్నంలో దారుణం చోటుచేసుకుంది. విశాఖలోని మారికవలస బ్రిడ్జి కింద కుళ్లిపోయిన మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. ఆ మృతదేహం గత కొంతకాలంగా కనిపించిన మురళి మృతదేహంగా గుర్తించారు.
విశాఖపట్నంలో దారుణం చోటుచేసుకుంది. విశాఖలోని మారికవలస బ్రిడ్జి కింద కుళ్లిపోయిన మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. ఆ మృతదేహం గత కొంతకాలంగా కనిపించిన మురళి మృతదేహంగా గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించి విచారణ చేపట్టిన పోలీసులు కీలక విషయాలు కనుగొన్నట్టుగా సమాచారం. మురళికి ఎనిమిదేళ్ల క్రితం విహహం జరిగింది. ఆ దంపతులకు బాబు కూడా ఉన్నాడు. అయితే ఉద్యోగ రీత్యా మురళి ఆఫ్రికాలో ఉండేవాడు. ఈ క్రమంలోనే విశాఖలో ఉంటున్న అతని భార్య మరో వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకున్నట్టుగా తెలుస్తోంది.
ఈ క్రమంలోనే కొద్ది రోజుల క్రితం మురళిని అతని భార్య దారుణంగా హత్య చేసినట్టుగా పోలీసులు గుర్తించినట్టుగా సమాచారం. హత్య అనంతరం మురళి మృతదేహాన్ని మారికవలస బ్రిడ్జి సమీపంలో పడేశారు. అయితే మరోవైపు మురళి ఆచూకీ లభించకపోవడంతో అతని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలోనే అన్ని కోణాల్లో దర్యాప్తు చేసిన పోలీసులు వివాహేతర సంబంధం వల్లనే ఈ హత్య జరిగినట్టుగా నిర్దారణకు వచ్చినట్టుగా తెలుస్తోంది. ఇందుకు సంబందించి మురళి భార్యను, ఆమె ప్రియుడిని అదుపులోకి తీసుకున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. అయితే ఈ హత్యకు గల కారణాలను పోలీసులు అధికారికంగా వెల్లడించాల్సి ఉంది.
