టిటిడి ఛైర్మన్ గా రాఘవేంద్రరావు ?

టిటిడి ఛైర్మన్ గా రాఘవేంద్రరావు ?

తిరుమల తిరుపతి దేవస్ధానం ట్రస్ట్ బోర్డు ఛైర్మన్ గా ప్రముఖ సినీ దర్శకుడు కె. రాఘవేంద్రరావును ప్రభుత్వం నియమిస్తోందా? సోషల్ మీడియాలో ఈ మేరకు ఈ వార్త ఒకటే వైరల్ గా మారింది. టిటిడి బోర్డు ఛైర్మన్ పోస్టు దాదాపు ఏడాదిగా ఖాళీగా ఉంది. ఛైర్మన్ పదవి కోసం చంద్రబాబుపై అన్నీ వైపుల నుండి విపరీతమైన ఒత్తిడి ఉండటంతో ఎవరిని నియమించాలో తేల్చుకోలేక నియామకాన్ని జాప్యం చేస్తున్నారు.

ఒకవైపు ఎంపిలు మురళీ మోహన్, రాయపాటి సాంబశివరావు, ఇంకోవైపు భారతీయజనతాపార్టీ నేతలు, మరోవైపు తన వియ్యంకుడు పుట్టా సుధాకర్ యాదవ్ కోసం యనమల రామకృష్ణుడు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అదే సమయంలో కొందరు పారిశ్రామిక వేత్తలు కూడా తమ వంతు ప్రయత్నాలు చేసుకుంటున్నట్లు సమాచారం. దాంతో ఎవరిని వేస్తే ఏమి సమస్య వస్తుందో అన్న ఉద్దేశ్యంతో పోస్టు నియామకం విషయంలో చంద్రబాబు ఇబ్బంది పడుతున్నారు.

ఈ నేపధ్యంలోనే సినీ ప్రముఖుడు రాఘవేంద్రరావు తన వంతు ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. ఇదే విషయమై ఇప్పటికే సిఎంను రాఘవేంద్రరావు మూడు సార్లు కలిసారట. మొన్నటి బోర్డులో కూడా దర్శకుడు సభ్యునిగా ఉన్న విషయం అందరికీ తెలిసిందే. ఎటూ బోర్డు సభ్యునిగా పనిచేశారు కాబట్టి ఈసారి ఛైర్మన్ గా ఇవ్వమని అడుగుతున్నారట. ఎన్నికలు దగ్గర పడుతున్నాయి కదా ఎవరి అవసరం ఏ రూపంలో వస్తుందో తెలీక చంద్రబాబు ఆందోళన పడు

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos