బోయలను ఎస్టీలలో చేర్చే డిమాండ్ అంగుళం కూడా కదల్లేదని బోయసంఘాలు చెబుతున్నాయి

అమలు కాని మరొక హామీ చంద్రబాబు నాయుడి కాళ్లకు చుట్టుకునేలా ఉంది.

ఇప్పటికే చాలా హామీలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని బాగా ఇబ్బంది పెడుతున్నాయి.

కాపులకు ‘బిసి’ హోదా హామీ ఇచ్చి తీర్చ లేక, తప్పించుకోలేక, ఒక కమిషన్ వేసి కాలయాపన చేస్తున్నారు. ఇపుడు దీనికి మరొక హామీ జోడవుతా ఉంది. అంది వాల్మీకి (బోయ)లను ఎస్ టిలుగా చేయడం. అనంతపురం బోయలు ఎక్కువ. తర్వాత కర్నూలు లో కూడా బాగానే ఉన్నారు. వీరందరి ఓట్ల కోసం 2014 ఎన్నికలపుడు బోయ , వాల్మీకులను ఎస్టీలుగా చేస్తానని హామీ ఇచ్చాడు. బోయల వోట్లు అనంతపురం జిల్లాలో ఫుల్ గా పడ్డాయి. అందుకే అక్కడ పార్టీకి బంపర్ మెజారిటీ వచ్చింది. పార్టీ తరఫున రాయదుర్గం నుంచి ఎన్నికల్లో నిలబడ్డ కాలువ శ్రీనివాసులు గెల్చారు.

రెండున్నరేళ్ళయింది.

ఈ హామీ అంగుళం కూడా కదల్లేదని వాల్మీకి సంఘాలు అడుగుతున్నాయి.మా డిమాండేమయిందన్న ప్రశ్న మొదట నెల్లూరు జిల్లాలో పుట్టింది.

ఈ రోజు వాల్మీకి (బోయ)సంక్షేమ సంఘం జిల్లా గౌరవాధ్యక్షుడు పిక్కిలి రవీంద్రబాబు ఈ డిమాండు ను గుర్తు చేస్తూ ఇంకా ఎన్నాళ్లు కావాలా అని ముఖ్యమంత్రిని ప్రశ్నించారు. జిల్లా అధ్యక్షుడు నల్లబోతుల వెంకటేశ్వర్లుతో కలసి ఆయన విలేకరుల తో మాట్లాడుతూ అసెంబ్లీలో ఉన్న బోయ ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు మీద కూడ అసంతృప్తి వ్యక్తం చేశారు.

‘ వాల్మీకి జాతి ద్వారా వెలుగులోకి వచ్చ రాయదుర్గం ఎమ్మెల్యేగా గెల్చిన కాలువ శ్రీనివాసులు తన పదవికి రాజీనామా చేసి చంద్రబాబు మీద ఉద్యమించేందుకు పూనుకోవాలి,’ అని డిమాండ్ చేశారు.

కాపు కార్పొరేషన్ ఏర్పాటు ను గుర్తు చేస్తూ వాల్మీకి ఫెడరేషన్ ను ఏర్పాటు చేసి దానికి రు. వేయికోట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. వాల్మీకి స్థితిగతుల ను అధ్యయనం చేసేందుకు ఏర్పాటుచేసిన సత్య పాల్ కమిటీ ఏమయిందని వారు ప్రశ్నించారు.