తెలంగాణలో అలాంటి కోపాన్ని చూశా: పవన్ కల్యాణ్

First Published 28, Jun 2018, 7:41 AM IST
North Andhra intellectuals are angry
Highlights

మేధావులు రోడ్లమీదకు రారు, వారు కూర్చొని మాట్లాడే ఒక మాట చాలా ప్రభావం చూపిస్తుందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు.

హైదరాబాద్: మేధావులు రోడ్లమీదకు రారు, వారు కూర్చొని మాట్లాడే ఒక మాట చాలా ప్రభావం చూపిస్తుందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. మేధావుల కోపం సమాజానికి మంచిది కాదు, తెలంగాణాలో తామను అలాంటి కోపాన్ని చూసానని చెప్పారు. మళ్ళీ అలాంటి కోపాన్ని ఇక్కడ ఉత్తరాంధ్ర మేధావులలో చూస్తున్నానని ఆయన అన్నారు.

బుధవారం పవన్ కల్యాణ్ ఉత్తరాంధ్ర మేధావులతో సమావేశమైన విషయం తెలిసిందే. మతాన్ని, మార్క్సిజాన్ని సంపూర్ణంగా అర్థం చేసుకున్న మహనీయుడు, మహా కవి పండిడుతు గుంటూరు శ్రీ గుంటూరు శేషేంద్ర అని పవన్ కల్యాణ్ ట్విట్టర్ లో ప్రశంసించారు. 

ఉత్తరాంధ్ర మేధావుల ఆగ్రం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం, బ్రెక్సిట్, కటలోనియ జాతీయత కోసం, లేదా ఈజిప్డు  అరబ్ స్ప్రింగ్ విప్లవం వంటి ఆత్మగౌరవ పోరాటలాకు దారి తీయవచ్చునని అన్నారు. 

సామాజిక, రాజకీయ చైతన్యం పెరుగుతున్న కొద్దీ సామాజిక, ఆర్థి, రాజకీయ అభివృద్ధిలో తమకు జరుగుతున్న అన్యాయాన్ని గుర్తిస్తారని, సామాజిక, సామాజిక, సాంస్కృతిక, రాజకీయ విస్తృతిని బట్టి అది సామాజిక అశాంతికి దారి తీస్తుందని ఆయన అన్నారు. 

ఉత్తరాంధ్ర ప్రజలు, యువకులు, మేధావులు ఆత్మగౌరవం కోసం, గౌరవం కోసం, రాజకీయ - ఆర్థిక సమానత్వం కోసం బలమైన ఉద్యమాన్ని నిర్మిస్తున్నారని అన్నారు. వారు పాలక వర్గాలను నమ్మడం లేదని, అది స్పష్టంగా తెలుస్తోందని పవన్ కల్యాణ్ అన్నారు.

ఆ వ్యాఖ్యను పోస్టు చేసి శేషేంద్ర శర్మ రాసిన ఆధునిక మహాభారతం గ్రంథం కవర్ పేజీని కూడా పోస్టు చేశారు.

loader