కొన్ని జిల్లాల్లో ఇన్ఛార్జ్ మంత్రులకు చేదు అనుభవాలు ఎదురవుతున్నా వారు సర్దుకుపోతున్నారు. పై మంత్రులు మాత్రమే చంద్రబాబునాయుడు వద్ద ఫిర్యాదు చేసారు. నారాయణ, చింతకాయలైతే తమ జిల్లాలను మార్చాలని కూడా విజ్ఞప్తి చేసారట.

ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ కొన్ని జిల్లాల్లో నేతలు ఇన్ఛార్జ్ మంత్రులకు ముచ్చెమటలు పట్టిస్తున్నారు. ప్రకాశం జిల్లాలో ఎంఎల్ఏ, ఎంపి, ఎంఎల్సీలు ఇన్ఛార్జ్ మంత్రి నారాయణ మాటను ఏమాత్రం ఖాతరు చేయటం లేదు. అదేవిధంగా కర్నూలు జిల్లాలో ప్రజాప్రతినిధులు, నేతలు కాల్వ శ్రీనివాసులును పట్టించుకోవటం లేదు. తాజాగా గుంటూరు జిల్లాలో చింతకాయల అయ్యన్నపత్రుడి వంతొచ్చింది.

పార్టీ కార్యాలయలో సమావేశంలో పాల్గొనేందుకు వచ్చిన చింతకాయల అయ్యన్నపాత్రుడు గంటన్నర పాటు కూర్చున్నా ఒక్క ఎంఎల్ఏ, ఎంపి, ఎంఎల్సీ కూడా హాజరుకాలేదు. ఓపిక నశించిన చింతకాయల ప్రజాప్రతినిధులపై చిందులు తొక్కుతూ అక్కడి నుండి వెళ్లిపోయారు. ప్రకాశం జిల్లాలో మంత్రి నారాయణకు ఇదేవిధబమైన అనుభవాలు ఎదురవుతున్నాయి. మంత్రి మాటను ఎంఎల్ఏ, ఎంపి, ఎంఎల్సీల్లో ఎవ్వరూ ఖాతరు చేయటం లేదు. అద్దంకి నియోజకవర్గంలో కరణం బలరాం-గొట్టిపాటి వర్గాల మధ్య వివాదాలే ప్రత్యక్ష ఉదాహరణ.

ఇక, కర్నూలు జిల్లాలో కూడా మంత్రి కాల్వ శ్రీనివాసులు మాటలు ఎవరూ పట్టించుకోవటం లేదు. జిల్లా అంతా వర్గ రాజకీయాలపైనే నడుస్తుంది. కాబట్టి నేతల మధ్య ఎప్పుడూ ఆధిపత్యపోరాటమే. ఈ నేపధ్యంలో కాల్వ చెప్పే మాటలను ఎవరూ వినటం లేదు. ఇటువంటి అనుభవాలే మరికొద్ది ఇన్ఛార్జ్ మంత్రులకూ ఎదురవుతున్నా వారు సర్దుకుపోతున్నారు. పై మంత్రులు మాత్రమే చంద్రబాబునాయుడు వద్ద ఫిర్యాదు చేసారు. నారాయణ, చింతకాయలైతే తమ జిల్లాలను మార్చాలని కూడా విజ్ఞప్తి చేసారట.