Asianet News TeluguAsianet News Telugu

పోలీసులపై  ఎంఎల్ఏ ఫైర్

  • కోర్టు నిషేధించిన కోళ్ళ పందేలను అధికారపార్టీ నేతలే ఉల్లంఘిస్తున్నారు.
Nobody is caring court directions over cock fights

కోర్టు నిషేధించిన కోళ్ళ పందేలను అధికారపార్టీ నేతలే ఉల్లంఘిస్తున్నారు. నిజానికి కోళ్ళపందేలను నియంత్రించటం, నిషేధించటమన్నది ఎవరికీ సాధ్యం కాదు. ఎందుకంటే, ప్రతీసారి పందేలను అడ్డుకుంటూ కోర్టులు ఆదేశాలు జారీ చేయటం, దాన్ని నేతలు ఉల్లంఘించటం మామూలైపోయింది. మిగిలిన రాజకీయాలు ఎలాగున్నా కోళ్ళపందేల దగ్గరకు వచ్చేసరికి అధికార, ప్రతిపక్ష నేతలందరూ ఏకమైపోతారు. కాబట్టి కోర్టులైనా, ప్రభుత్వమైనా చేయగలిగేది ఏమీ ఉండదు. ఉభయగోదావరి జిల్లాలతో పాటు కృష్ణా, గుంటూరు జిల్లాల్లో అధికారపార్టీ ప్రజాప్రతినిధులు పెద్ద ఎత్తున కోళ్ళపందేల్లో పాల్గొంటున్నారు.

ఇక, ప్రస్తుత విషయానికి వస్తే ఉభయగోదావరి, కృష్ణా జిల్లాలో యధేచ్చగా కోళ్ల పందేలు జరుగుతున్నాయి. కృష్ణాజిల్లాలో పెనమలూరు ఎంఎల్ఏ బోడె ప్రసాద్ ఏకంగా పోలీసులపైనే ఫైర్ అయ్యారు. కంకిపాడు మండలంలోని ఈడ్పుగల్లులో కోడిపందేలు జరుగుతున్నాయి. గ్రామంలో ఎక్కడా కోళ్ళపందేలు నిర్వహించకుండా పోలీసులు పికెట్లు ఏర్పాటు చేశారు. అయితే, జనాలు, పందెం రాయళ్ళు పికెట్లను లెక్క చేయకుండా కోళ్ళ పందేలను మొదలుపెట్టారు.

దాంతో పోలీసులు అక్కడికి వచ్చి పందేలను అడ్డుకున్నారు. విషయం తెలియగానే ఎంఎల్ఏ బోడె ప్రసాద్ వెంటనే అక్కడకు వచ్చి పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఎట్టి పరిస్థితుల్లోనూ పందేలు జరపాల్సిందేనంటూ ఎంఎల్ఏ తెగేసి చెప్పటంతో పోలీసులు ఏమీ చేయలేకపోయారు.

అదేవిధంగా పశ్చిమగోదావరి జిల్లా కేంద్రమైన ఏలూరు డివిజన్ పరిధిలో సుమారు 700 మంది పందెం రాయళ్ళను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దెందులూరు, ఏలూరు రూరల్ మండలాల్లో పెద్ద ఎత్తున కోళ్ళపందేలు జరిగాయి. పలుచోట్ల పోలీసులు దాడులు చేసి పందెంబరులను ధ్వంసం చేశారు. కోళ్ళపందేలను అడ్డుకునేందుకు పోలీసులు ముదుజాగ్రత్తగా ఏపిఎస్పి బెటాలియన్నే ఏర్పాటు చేయటం గమనార్హం. ఏలూరు డివిజన్ కు చెందిన 500 మందిపై బైండోవర్ కేసులు పెట్టారు. కోళ్ళపందేలను అడ్డుకునేందుకు పోలీసులు వివిధ ప్రాంతాల్లో 67 పికెట్లు, 10 చెక్ పోస్టులను ఏర్పాటు చేశారు. అంతేకాకుండా ఎక్కడెక్కడ పందెంబరులను ఏర్పాటు చేశారో అక్కడల్లా ప్రత్యేకించి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.

 

 

Follow Us:
Download App:
  • android
  • ios