నంద్యాల ఉపఎన్నిక పై స‌ర్వేల నిషేధం. రోజుకు ప‌ది స‌ర్వేల ఫ‌లితాలు విడుద‌ల చేస్తున్నారు. తికమక పడ్డ ప్రజలు. ఎన్నిక జరిగే రోజు వరకు వర్తింపు

 నంద్యాల ఉపఎన్నిక పై స‌ర్వేల నిషేధం. ఎన్నిక‌ల‌ సంద‌ర్భంగా అక్క‌డ‌ ఎలాంటి స‌ర్వేలు నిర్వ‌హించ‌రాద‌ని తెలిపారు రిట‌ర్నింగ్ అధికారి. బుధ‌వారం స‌ర్వేల‌ను నిషేధిస్తూ తాజాగా ఆదేశాలు జారీ చేశారు. ఒక‌వేళ అదేశాల‌ను ఉల్లంఘిస్తే త‌గిన చ‌ర్య‌లు ఉంటాయ‌ని తెలిపారు. ఇప్ప‌టికే రోజుకు ప‌ది స‌ర్వేల ఫ‌లితాలు విడుద‌ల చేస్తున్నారు. దీనితో అక్క‌డి ప్ర‌జ‌లు ఎవ‌రిది నిజ‌మైనా స‌ర్వేనో తెల్చుకోలేక‌పోతున్నారు. ఇప్పుడు ఎన్నిక‌ల సంఘం తాజా ప్ర‌క‌ట‌న‌తో ప్ర‌జ‌లు ఉపిరి పీల్చుకున్నారు. 


ఎన్నిక‌ల‌కు సంబంధించి విద్యార్థులు, ఎన్జీవోలు, పార్టీలు, ఇత‌రులు ఎవ‌ర‌యినా స‌రే నంద్యాల్లో స‌ర్వేలు నిర్వ‌హించ‌కూడ‌ద‌ని ఆదేశాలు జారీచేశారు. స‌ర్వేల వ‌ల‌న ప్ర‌జ‌లు త‌ప్పుదొవ ప‌ట్టే అవ‌కాశం ఉంద‌ని తెలిపారు. త‌మ ఆదేశాలు ప‌క్క‌న‌బెట్టి స‌ర్వేలు నిర్వ‌హిస్తే ఎన్నిక‌ల ప్ర‌వ‌ర్త‌నా నియ‌మావ‌ళి ప్ర‌కారం చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని అధికారులు తెలిపారు. నంద్యాల‌లో ఎన్నిక‌లు పూర్తయ్యే వ‌ర‌కు ఈ ఆదేశాలు వ‌ర్తిస్తాయ‌ని వివ‌రించారు. ఈ నెల 23న నంద్యాల‌ ఉపఎన్నిక జ‌ర‌గ‌నున్న విష‌యం తెలిసిందే.