తిరుపతి: కరోనా నేపథ్యంలో తిరుమలలో భక్తులకు దర్శనాల టిక్కెట్లను పెంచే ఆలోచన లేదని టీటీడీ ఛైర్మెన్ వైవీ సుబ్బారెడ్డి ప్రకటించారు. కేంద్రం ఇచ్చే మార్గదర్శకాలకు అనుగుణంగా దర్శనాల టిక్కెట్లను పెంచే విషయాన్ని పరిశీలించనున్నట్టుగా ఆయన తెలిపారు.

ప్రస్తుతం 12 వేల టిక్కెట్లను ఆన్ లైన్ లో బుక్ చేసుకొనే వెసులుబాటును కల్పించామని ఆయన చెప్పారు. గతంలో 9 వేల టిక్కెట్లు ఆన్ లైన్ లో, మూడు వేల టిక్కెట్లను ఆఫ్ లైన్ లో ఇచ్చేవారు.  అయితే కరోనా కారణంగా ఆప్ లైన్ లో ఇచ్చే 3 వేల టిక్కెట్లను నిలిపివేశారు. వీటిని కూడ ఆన్ లైన్ లో ఇస్తున్నారు.

also read:తిరుమలకు కరోనా దెబ్బ: సర్వదర్శనం టోకెన్ల జారీ నిలిపివేత

కరోనా నుండి ఆలయంలో పనిచేస్తున్న అర్చకులు కోలుకున్నారని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. పవిత్ర పుణ్యక్షేత్రం తిరుపతిలో నిర్మాణంలో ఉన్న గడువ వారథి ఫ్లైఓవర్‌ బ్రిడ్జి పనులు వేగంగా జరుగుతున్నాయన్నారు. ఈ బ్రిడ్జి పనులు వచ్చే ఏడాది ప్రారంభంలోనే పూర్తి అవుతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

 గరుడ వారధి వల్ల శ్రీవారి భక్తులను అనేక ప్రయోజనాలు చేకూరనున్నాయని తెలిపారు. ఎలాంటి ట్రాఫిక్‌ ఇబ్బందులు లేకుండా తిరుమలకు రావచ్చన్నారు. తిరుపతి వాసులకు కూడా ట్రాఫిక్‌ కష్టాలు తీరనున్నాయని ఆయన చెప్పారు.

.