26వ తేదీన జరుగనున్న ప్రత్యేకహోదా ఉద్యమాన్ని జరగనివ్వమంటూ తాజాగా డిజిపి సాంబశివరావు స్పష్టం చేసారు.

అందరూ అనుమానిస్తున్నదే జరుగుతోంది. చంద్రబాబునాయుడు తాను వెనుకనుండి ప్రత్యేకహోదాకు అడ్డంకులు సృష్టిస్తున్నారు. విశాఖపట్నం ఆర్కె బీచ్ లో 26వ తేదీన జరుగనున్న ప్రత్యేకహోదా ఉద్యమాన్ని జరగనివ్వమంటూ తాజాగా డిజిపి సాంబశివరావు స్పష్టం చేసారు. ఎంతపెద్ద మీటింగైనా ఎవరో ఒకరు ఆర్గనైజర్లుంటారట. అటువంటిది 26 ఉద్యమానికి ఎవరూ ఆర్గనైజర్లు లేరట. కాబట్టి ఏమన్నా జరిగితే బాధ్యత తీసుకునేందుకు ఎవరూ ఉండరంటూ ఉద్యమానికి అనుమతిచ్చేది ఇవ్వబోమని డిజిపి విచిత్రమైన వాదన తెరపైకి తెచ్చారు.

ఏమైనా జరిగితే అని డిజిపి ఎందుకు అంటున్నారు. అంటే ఏమైనా జరుగుతుందని అనుమానిస్తున్నారా? అసలు ఏమీ జరగకుండా చూడటానికే కదా పోలీసులున్నది? అంటే తెరవెనుక ‘ముఖ్యు’ల నుండి వచ్చిన ఆదేశాల మేరకు డిజిపి మాట్లాడుతున్నారన్నది స్పష్టమైపోయింది. ఎందుకంటే, ఉద్యమం జరగటం చంద్రబాబుకు మొదటి నుండి ఏమాత్రం ఇష్టం లేదు. ప్రత్యేకహోదా అన్న మాట వింటేనే చంద్రబాబు ఉలికిపడుతున్నారు. సరే,చంద్రబాబుకు ఇష్టమున్నా లేకపోయినా, డిజిపి ఎంత చెప్పినా జనాలైతే ఆగేట్లు లేరు. చూద్దాం 26న ఏమి జరుగుతుందో.