భార‌త‌ ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ ప‌ర్య‌ట‌న‌లలో పూలబొకేలు ఇవ్వడం ఇకమీదట కుదరదు. ఆయన మనదేశంలో ఏ కార్యక్రమంలో పాల్గొన్నా స్వాగతం పలుకుతూ పూల బోకేలు ఇవ్వ‌కూడ‌దని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం వెలువరించింది. ఇలా ప్ర‌ధానికి బోకేలు అంద‌జేయ్య‌కూడ‌ద‌ని మినిష్ట్రీ ఆఫ్ హోం ఎఫైర్స్‌ తాజాగా గైడ్‌లైన్స్ విడుద‌ల చేసింది. కొద్దిసేప‌టి క్రిత‌మే విడుద‌ల చేసిన ఈ నూత‌న విధానం ప్ర‌ధాని కోరిక మేర‌కే ప్ల‌వ‌ర్ బోకేల‌ను అంద‌జేయ్య‌డం ర‌ద్దు చేసిన‌ట్లు తెలిపింది. అయితే మోదీ త‌న‌కి ఇచ్చే ప్ల‌వ‌ర్ బోకేలు,శాలువాల‌కు బ‌దులుగా ఉప‌యోగ‌క‌ర‌మైన బుక్స్‌, ఖాదీ వస్త్రాలు ఇవ్వ‌వ‌ల్సిందిగా కోరారట‌.

ప్ల‌వ‌ర్ బోకేలు ఒక‌టి రెండు రోజుల్లో తీసి చెత్త కుండిలో పారేస్తాము, కానీ గిఫ్ట్ గా ఇచ్చిన విలువైన పుస్త‌కాలు, బ‌ట్ట‌లు ఉప‌యోగ‌క‌ర‌మ‌ని ఆయ‌న తెలిపిన‌ట్లు మినీస్ట్రీ ఆఫ్‌ హూం ఎఫైర్స్ శాఖ పెర్కొంది. నిజంగా ఇది ఆహ్వానించ‌ద‌గ్గ‌ విష‌యం. వేల రూపాయ‌లు కేవ‌లం బోకేలు కోన‌డానికి ఉప‌యోగిస్తు ఉంటారు. ఈ నిర్ణ‌యంతో అన‌వ‌స‌రపు ఖ‌ర్చు త‌గ్గిన‌ట్లే. మ‌న ప్ర‌ధాని నరేంద్ర మోదీ రోజు స‌గ‌టున 5 ప్రొగ్రాంల‌కు హాజ‌ర‌వుతారు.ఒక్క బోకేకు స‌గ‌టున ఐదు వంద‌లు ఖ‌ర్చు పెట్టిన 2500 రూపాయ‌లు కేవ‌లం బోకేల‌కే ఖ‌ర్చు అవుతుంది. ఇక షాలువాల‌కు అయితే మ‌రో 5 వేల వ‌ర‌కు ఖ‌ర్చు అవుతుంది, ఇప్పుడు రోజుకి దాదాపుగా 10000 రూపాయ‌లు అన‌వ‌స‌ర‌పు ఖ‌ర్చు త‌గ్గిన‌ట్లే.