చంద్రబాబునే పక్కన పెట్టేసారా?

చంద్రబాబునే పక్కన పెట్టేసారా?

చంద్రబాబునాయుడునే పూర్తిగా పక్కన పెట్టేసారా? హైదారాబాద్లో మంగళవారం నుండి మూడు రోజులు జరుగనున్న అంతర్జాతీయ ఎంటర్ ప్రెన్యూర్ సదస్సుకు చంద్రబాబుకు ఆహ్వానమే లేదట. చంద్రబాబు లాంటి సీనియర్ రాజకీయా నేతను, ప్రపంచ ఆర్ధికవేత్తలనే ఆకట్టుకోగలిగిన చంద్రబాబును నిర్వాహకులు పూర్తిగా పక్కనపెట్టేయటం నిజంగా వెరీ బ్యాడ్. రేపటి నుండి జరుగుతున్న ‘గ్లోబల్ ఎంటర్ ప్రెన్యూర్ సమ్మిట్ కు  ఎందుకంత క్రేజు? అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ గారి కుమార్తె, వైట్ హౌస్ సలహాదారు ఇవాంకా ట్రంప్ హాజరవుతున్నారు కాబట్టే. లేకపోతే, ఆ సమ్మిట్ కు అంత సీన్ ఉండకపోను.

స్వయంగా ఇవాంకా హాజరవుతున్న సమ్మిట్ కు ఎక్కడెక్కడి నుండో అతిధులు వచ్చి హాజరవుతుంటే, హైదరాబాద్ ను తానే నిర్మించానని పదే పదే చెప్పుకునే చంద్రబాబు హాజరుకాకపోతే ఏం బాగుంటుంది చెప్పండి ? కానీ హాజరవ్వాలన్న కోరికున్నంత మాత్రాన హాజరవ్వలేరు కదా ? ఎందుకంటే, అది అంతర్జాతీయ సదస్సు. ఎవరికి ఆహ్వానాలు పంపాలి, సదస్సు ఎక్కడ నిర్వహించాలన్నది పూర్తిగా సదస్సు నిర్వాహకుల ఇష్టమే. ప్రభుత్వాలకు ఏమీ సంబంధం ఉండదు.

అటువంటి సదస్సుకు ఆహ్వానం అందుతుందేమో అని చంద్రబాబు ఎదురు చూశారు. ఎంతకీ ఆహ్వానం అందకపోయేసరికి కేంద్రానికి లేఖ రాయించారట. ఏపి ఎకనమిక్ బోర్డ్ కేంద్రానికి ఓ లేఖ రాసిందట. ‘సమ్మిట్ లో హాజరయ్యేందుకు ఏపి ప్రభుత్వానికి ఆసక్తి ఉంది కాబట్టి అవకాశం ఇవ్వ’మని కోరిందట లేఖలో.

అయితే, కేంద్రం సమాధానమిస్తూ తమకేమీ సంబంధం లేదని తేల్చేసిందట. సమ్మిట్ నిర్వహణకు ఒక వేదిక కావాలి కాబట్టి హైదరాబాద్ ను వేదిక చేసుకున్నదని, నిజానికి స్ధానిక ప్రభుత్వానికి కూడా నిర్వహణలో సంబంధమే లేదని స్పష్టం చేసిందట. దాంతో ప్రభుత్వం ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయింది. నిజానికి కేంద్రం గనుక చొరవ తీసుకుని ఆహ్వానం అందేట్లు చేసుంటే ఇవాంకా సమక్షంలో చంద్రబాబు ఏం రేంజిలో రెచ్చిపోయేవారో ఎవరికి వారు ఊహిచుకోవాల్సిందే.

ఎక్కడో దావోస్ లో జరిగే అంతర్జాతీయ ఆర్ధిక సదస్సులకు ప్రతి సంవత్సరం చంద్రబాబు హాజరవ్వగలుగుతున్నారు. మరి పక్కనే హైదరాబాద్ లో జరుగుతున్న మూడు రోజుల సమ్మిట్ కు మాత్రం నో ఎంట్రి అంటే...చేసేదేముంది?   ఇదే విషయమై ప్రభుత్వంలోని ఓ కీలక వ్యక్తి ‘ఏషియానెట్’ తో మాట్లాడుతూ ‘అసెంబ్లీ సమావేశాల్లో బిజీగా ఉన్న కారణంగా సిఎం గారు ఎంటర్ ప్రెన్యూర్ సమ్మిట్ గురించి ఆలోచించటం లేద’న్నారు.

 

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos

MORE FROM Andhra Pradesh

Next page