Asianet News TeluguAsianet News Telugu

సొంత ఎమ్మెల్యేలను అమ్ముకున్నది వైసిపీనే...: చినరాజప్ప సంచలనం

పక్క రాష్ట్రం తెలంగాణలో తమ పార్టీ తరపున గెలిచిన ఎమ్మెల్యేలను వైసిపి అదిష్టానం టీఆర్ఎస్ కు అమ్ముకుందని మాజీ హోంమంత్రి, ఎమ్మెల్యే నిమ్మకాయల చిన్నరాజప్ప సంచలన ఆరోపణలు చేశారు. 

nimmakayala chinarajappa sensational comments on YSRCP
Author
Guntur, First Published Jun 8, 2020, 10:15 PM IST

గుంటూరు: పక్క రాష్ట్రం తెలంగాణలో తమ పార్టీ తరపున గెలిచిన ఎమ్మెల్యేలను వైసిపి అదిష్టానం టీఆర్ఎస్ కు అమ్ముకుందని మాజీ హోంమంత్రి, ఎమ్మెల్యే నిమ్మకాయల చిన్నరాజప్ప సంచలన ఆరోపణలు చేశారు. అలాంటి పార్టీలో వున్న నాయకులు ఇప్పుడు టీడీపీ గురించి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆయన మండిపడ్డారు. 

''పేటీఎం బ్యాచ్, దొంగ ఖాతాలు పెట్టే వైసీపీ నాయకుల్లా టీడీపీ గురించి మాట్లాడేది? తెలంగాణలో, హైదరాబాద్ లోను తెలుగుదేశంపైన లెక్కలేనన్ని దాడులు, కుట్రలు జరిగినా నేటికీ పార్టీ నిలబడింది. మేలో జరిగిన మహానాడులో ప్రవేశపెట్టిన తీర్మానాలు అక్షర సత్యం. తెలంగాణలో వైసీపీ తరుపున ఎన్నికైన వారిని టీఆర్ఎస్ కు అమ్ముకున్నారు. అలాంటి వైసిపి నేతలకు తెలుగుదేశాన్ని విమర్శించే నైతిక హక్కు ఉందా?'' అని ప్రశ్నించారు. 

''తెలుగుదేశం స్వచ్ఛంధంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని గౌరవించింది. ఎప్పటికప్పుడు అభివృద్ధి చెందుతున్న సమాజానికి అనుగుణంగా తెలుగుదేశం పార్టీ టెక్నాలిజీని ఉపయోగించుకుంటూ ప్రజలకు, కార్యకర్తలకు చేరువుగా ఉంటుంది. ఇలా టెక్నాలజీని అందిపుచ్చుకునే హైదరాబాద్ లోను హైటెక్ సిటీని నిర్మించి 13 లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చాం'' అని వెల్లడించారు.  

read more   నిరుద్యోగ యువతకు తీపికబురు... వైద్య శాఖలో ఉద్యోగాల భర్తీకి సీఎం జగన్ ఆదేశాలు

''వైసీపీలా ట్విటర్లలో పోస్టింగులు పెట్టడానికి కిరాయి పేటీఎం బ్యాచ్ లను పెంచి పోషించారు.  బీహార్ నుంచి దొంగ ఖాతాలు పెట్టిన వారు ఇప్పుడు తెలుగుదేశం ట్విట్టర్, జూమ్ గురించి మాట్లాడుతున్నారు'' అని మండిపడ్డారు. 

''సంపూర్ణ మద్య నిషేదం చేస్తానని పేదలను నమ్మించి మోసం చేసి ఏడాదికి రూ.5వేల కోట్లు, ఐదేళ్లల్లో రూ.20వేల కోట్లు జే –టాక్స్ వసూలు చేసుకునే మీ మాటలు ప్రజలు విశ్వసించరు. దోచుకోవడం, దాచుకోవడం ఆల్ కాపీ రైట్స్, ఆల్ పేటెంట్స్, సోల్ ప్రోప్రైటర్ వైసీపీవే. గుడివాడ అమర్ నాథ్ గుడ్డి గుర్రంలా కాకుండా కళ్లు తెరిచి వాస్తవాలు చూడాలి'' అని చిన్నరాజప్ప సూచించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios