కర్నూలు  జిల్లాల National Investigation Agency అధికారులు  సోదాలు చేపట్టారు. విరసం నేత పినాకపాణి (Pinakapani) ఇంట్లో ఎన్‌ఐఏ సోదాలు నిర్వహించింది. 

కర్నూలు జిల్లాల National Investigation Agency అధికారులు సోదాలు చేపట్టారు. విరసం నేత పినాకపాణి (Pinakapani) ఇంట్లో ఎన్‌ఐఏ సోదాలు నిర్వహించింది. నగరంలోని శ్రీ లక్ష్మీ నగర్‌లోని విరసం నేత నివాసంలో అధికారులు తనిఖీలు చేపట్టారు. ఫిబ్రవరిలో పినాకపాణిలో కొచ్చిలో ఎన్‌ఐఏ అధికారులు కేసు నమోదు చేశారు. ఈ క్రమంలోనే శనివారం పినాకపాణి నివాసంలో ఎన్‌ఐఏ అధికారులు సోదాలు చేపట్టారు. అయితే ఈ సోదాలకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

ఇక, గతంలో కూడా పినాకపాణిని ఎన్‌ఐఏ విచారించిన విషయం తెలిసిందే. గతేడాది పినాకపాణి ఇంట్లో ఎన్‌ఏఐ అధికారులు సోదాలు చేపట్టారు. కేరళకు చెందిన ఎన్‌ఐఏ డీఎష్పీ సాజీమున్, ఇతర సిబ్బంది వచ్చి సోదాలు నిర్వహించారు. అప్పుడు ఇంట్లో ఉన్న కొన్ని పుస్తకాలు, పెన్‌డ్రైవ్, హార్డ్ డిస్క్‌లను ఎన్‌ఐఏ అధికారులు స్వాధీనం చేసుకన్నారు.