పాకిస్తాన్ చెందిన ఏజెంట్లతో కుమ్మక్కై  ఇండియాకు చెందిన నేవీ సమాచారాన్ని అందించినట్టుగా ఎన్ఐఏ గుర్తించింది.ఈ వ్యవహారంలో కీలకంగా వ్యవహారించిన గుజరాత్ కు చెందిన ఇమ్రాన్ ను ఎన్ఐఏ మంగళవారం నాడు అరెస్ట్ చేసింది.

విశాఖపట్టణం నేవీ అధికారులు  హానీట్రాప్ లో చిక్కుకొన్నారు. భారత నావికాదళానికి చెందిన కీలక సమాచారాన్ని పాకిస్తాన్ కు చేరవేశారు. ఇందుకు గాను నేవీ అధికారుల బ్యాంకు ఖాతాల్లో భారీగా డబ్బులు జమ చేశారు. 

గుజరాత్ రాష్ట్రంలోని గోద్రాలోని పంచమాల్ కు చెందిన గిట్లీ ఇమ్రాన్ ను ఎన్ఐఏ అరెస్ట్ చేసింది. పాకిస్తాన్ ఏజంట్లతో ఇమ్రాన్ కు సంబంధాలు ఉన్నట్టుగా ఎన్ఐఏ గుర్తించింది. 

also read:విశాఖ కేంద్రంగా హానీట్రాప్: కీలక వ్యక్తిని అరెస్ట్ చేసిన ఎన్ఐఏ

పాకిస్తాన్ ఏజంట్ల నుండి వచ్చిన డబ్బును ఇమ్రాన్ విశాఖలోని నేవీ అధికారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేసేవాడు. ఇందుకు గాను ఇండియా నేవీ కీలక సమాచారాన్ని పాక్ కు చేరవేసినట్టుగా ఎన్ఐఏ గుర్తించింది.ఇమ్రాన్ నుండి డిజిటల్ పరికరాలతో పాటు కీలక డాక్యుమెంట్లను ఎన్ఐఏ స్వాధీనం చేసుకొంది. 

విశాఖ హానీ ట్రాప్ కేసులో ఇప్పటికే కీలకసభ్యులను ఎన్ఐఏ అరెస్ట్ చేసింది. తాజాగా కీలక సూత్రధారి ఇమ్రాన్ ను  కూడ ఎన్ఐఏ అరెస్ట్ చేసింది.