ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర మంత్రులుగా గురువారం ధర్మాన కృష్ణప్రసాద్‌, అవంతి శ్రీనివాస్‌, బాలినేని శ్రీనివాస్‌రెడ్డి బాధ్యతలు చేపట్టారు. రోడ్లు, భవనాల శాఖ మంత్రిగా ధర్మాన కృష్ణప్రసాద్‌, పర్యాటక శాఖ మంత్రిగా అవంతి శ్రీనివాస్, విద్యుత్ శాఖ మంత్రిగా  బాలినేని శ్రీనివాసరెడ్డి బాధ్యతలు స్వీకరించారు.

దుర్గగుడి ఫ్లైఓవర్‌ను డిసెంబర్‌ నాటికి పూర్తి చేస్తామని మంత్రి ధర్మాన తెలిపారు. గతంలో వైఎస్సార్‌ దగ్గర పనిచేయడం.. ఇప్పుడు ఆయన తనయుడు వైఎస్‌ జగన్‌ దగ్గర మంత్రిగా పనిచేయడం ఆనందంగా ఉందని బాలినేని శ్రీనివాస్‌ రెడ్డి అన్నారు.