Asianet News TeluguAsianet News Telugu

త్వ‌ర‌లో 20 మెడిక‌ల్ కాలేజీలు

ఆంధ్రప్రదేశ్‌లో ఏనాడు లేని విధంగా వైద్యానికి అధిక ప్రాధాన్యత అన్న చంద్రబాబు

రాష్ట్రానికి భారీస్థాయిలో పెట్టుబడులు వ‌స్తున్నాయ‌న చంద్రబాబు

అంద‌రికి అందుబాటులో కార్పోరేట్ వైద్యమన్న సీఎం

newly 20 medical colleges in andra

రాష్ట్రానికి త్వ‌ర‌లో 20 మెడిక‌ల్ కాలేజీలు వ‌స్తున్నాయ‌ని తెలిపారు ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు, అందుకు త‌గిన ఒప్పందాలు కూడా జ‌రిగిన‌ట్లు ఆయ‌న పెర్కోన్నారు. రానున్న రోజుల్లో అమరావతి వైద్య పర్యాటక హబ్‌గా మారబోతోందని ఆయ‌న తెలిపారు. గుంటూరు జిల్లా మంగళగిరి మండలం ఎర్రపాలెం హెల్త్‌ మెడిసిటీకి బుధ‌వారం ఆయన రిమోట్ కంట్రోల్ ద్వారా శంకుస్థాపన చేశారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. గ‌తంలో ఆంధ్రప్రదేశ్‌లో ఏనాడు లేని విధంగా వైద్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నామ‌ని తెలిపారు సీఎం. మ‌రి కొద్ది రోజుల్లో రాష్ట్రానికి భారీస్థాయిలో పెట్టుబడులు వ‌స్తున్నాయ‌ని ఆయ‌న తెలిపారు. అంద‌రికి అందుబాటులో కార్పోరేట్ వైద్యం కోసం ప్ర‌య‌త్నాలు ప్రారంభించామ‌ని ఆయ‌న తెలిపారు. ఉద్యోగులు, జర్నలిస్టుల కూడా హెల్త్‌కార్డులు ఇచ్చామ‌న్నారు. రాష్ట్రంలో సంచార వైద్య‌ వాహానాల‌కోసం కోసం 200కి పైగా ఏర్పాటుచేమన్నారు.  గ్రామ స్థాయిలో అంద‌రికి స‌రైనా వైద్యం కోసం ప‌లు ప‌థకాలు ప్రారంభించామ‌ని తెలిపారు. "తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్‌", "ఎన్టీఆర్‌ బేబీ కిట్‌" వంటి కార్యక్రమాలు చేపట్టాం అని తెలిపారు. త్వ‌ర‌లో ప‌లు అభివృద్ది కార్య‌క్ర‌మాల‌ను ప్ర‌భుత్వం వెల్ల‌డిస్తుంద‌ని చంద్ర‌బాబు పెర్కొన్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios