Asianet News TeluguAsianet News Telugu

‘సదావర్తి’ వేలంలో కీలక మలుపు

  • సదావర్తి భూముల వేలం కేసు కొత్త మలుపు తిరిగింది.
  • సదావర్తి భూముల వేలాన్ని నిలిపివేయాలంటూ తమిళనాడు ప్రభుత్వం శుక్రవారం సుప్రింకోర్టులో పిటీషన్ వేసింది.
  • సత్రం భూములతో అసలు ఏపికి సంబంధమే లేదంటూ కొత్త వాదనను తెరపైకి తెచ్చింది.
  • సదరు భూములపై ఇప్పటికే మద్రాసు హై కోర్టులో అనేక కేసులు పెండింగ్ లో ఉన్నట్లు తమిళనాడు పేర్కొనటం గమనార్హం.
New twist in sadavarti land auction case

సదావర్తి భూముల వేలం కేసు కొత్త మలుపు తిరిగింది. సదావర్తి భూముల వేలాన్ని నిలిపివేయాలంటూ తమిళనాడు ప్రభుత్వం శుక్రవారం సుప్రింకోర్టులో పిటీషన్ వేసింది. సత్రం భూములతో అసలు ఏపికి సంబంధమే లేదంటూ కొత్త వాదనను తెరపైకి తెచ్చింది. సదరు భూములపై ఇప్పటికే మద్రాసు హై కోర్టులో అనేక కేసులు పెండింగ్ లో ఉన్నట్లు తమిళనాడు పేర్కొనటం గమనార్హం. ఈనెల 18వ తేదీన బహిరంగ వేలాన్ని నిర్వహించాలని ఈ మధ్యనే సుప్రింకోర్టు ఏపి ప్రభుత్వాన్ని ఆదేశించిన సంగతి అందరికీ తెలిసిందే.

సదావర్తి భూములపై చంద్రబాబునాయుడు-వైసీపీ ఎంఎల్ఏ ఆళ్ళ రామకృష్ణారెడ్డికి మధ్య జరుగుతున్న న్యాయపోరాటంలో ప్రభుత్వానికి పరువు పోయిందన్నది వాస్తవం. తనకు కావాల్సిన వారికి ఏకపక్షంగా భూములను కారుచౌకగా కట్టబెట్టానికి చంద్రబాబు చేసిన ప్రయత్నాన్ని ఆళ్ళ అడ్డుకున్నారు. చంద్రబాబు నిర్ణయాన్ని ఆళ్ళ కోర్టులో కేసు వేయటం ద్వారా ఎండగట్టారు. దాంతో విషయం బయటకుపొక్కింది. జాతీయ స్ధాయిలో వేలంపాటను నిర్వహించటం ద్వారా భూములను అమ్మాలంటూ సుప్రింకోర్టు ఆదేశించింది. అయితే, ఇన్ని రోజులు ఏమీ మాట్లాడకుండా కూర్చున్న తమిళనాడు ప్రభుత్వం హటాత్తుగా ఇప్పుడే ఎందుకు సుప్రింకోర్టులో పిటీషన్ విసిందన్నదే అర్దం కావటం లేదు.

Follow Us:
Download App:
  • android
  • ios