ఏపీలో మరో కొత్త రాజకీయ పార్టీ ఆవిర్భావం..

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ, టీడీపీ పార్టీలకు పోటీగా మరో కొత్త పార్టీ పుట్టుకొచ్చింది. జై భీమ్ పార్టీ అనే పేరుతో మొదలైన ఈ రాజకీయ పార్టీ గురువారం విజయవాడలో ఆవిర్బావ సభ జరిగింది. 

new political party in andhrapradesh

విజయవాడ : andhrapradeshలో కొత్త రాజకీయ పార్టీ ఆవిర్భవించింది. గురువారం సాయంత్రం విజయవాడలో
Jai Bhim Party ఆవిర్భావ సభ నిర్వహించారు. పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు శ్రవణ్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్రంలో పొలిటికల్ వాక్యూమ్ ఉందన్నారు. దళితుల కోసం పోరాడే పార్టీ రాష్ట్రంలో ఒక్కటి కూడా లేదన్నారు. తాను 28 ఏళ్లకే న్యాయమూర్తి అయ్యానని, పదేళ్ళలో ఆ పదవిని వదలి వచ్చానన్నారు. రూపాయికి కిలో బియ్యం, రెండువందలకు ఆయిల్ ప్యాకెట్ ఇచ్చే పార్టీలను పొగుడుదామా అని ప్రశ్నించారు.

దళిత బిడ్డలకు మేనమామ అని చెప్పిన జగన్ ఆ తర్వాత చేసిన అన్యాయం ఎవ్వరూ మర్చిపోరు అన్నారు. వైసీపీ దుర్మార్గ పాలనను ప్రశ్నించాలని పిలుపునిచ్చారు. ఆ పార్టీలోని దళిత నాయకులను ఓడించేందుకు ఈ పార్టీ పెడుతున్నట్లు స్పష్టం చేశారు. ప్రజలకు అన్యాయం చేసే వారిని ప్రశ్నిస్తాం అని తెలిపారు. సాంఘిక సంక్షేమ శాఖ మంత్రితో సబ్ ప్లాన్ పై ఎక్కడైనా చర్చిస్తానని సవాల్ విసిరారు. 26 రకాల దళిత స్కీమ్ లను జగన్ రద్దు చేశారని విమర్శించారు. విదేశీ విద్య కోసం వెళ్లేవారు ప్రభుత్వం నుంచి నిధులు అందక ఇబ్బంది పడుతున్నారన్నారు. ఓడిపో,  ఓడించు,  గెలువు అన్న కాన్షీరామ్ మాటలు తనకు స్ఫూర్తి అని శ్రవణ్ కుమార్ పేర్కొన్నారు. 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios