గుంటూరులో నవజాత శిశువు కిడ్నాప్... తల్లి పక్కలోంచి పాపను ఎత్తుకెళ్లిన మహిళ (సిసి ఫుటేజి)

కేవలం ఆరు రోజుల వయసు నవజాత శిశువును ఓ మహిళ హాస్పిటల్లోంచి ఎత్తుకెళ్లిన ఘటన గుంటూరులో వెలుగుచూసింది. అయితే 24గంటల్లోనే ఈ కిడ్నాప్ కేసును చేదించిన పోలీసులు చిన్నారిని తల్లిఒడికి చేర్చారు. 

New born baby kidnapped in  Guntur GGH AKP

గుంటూరు : తల్లి పక్కన పడుకున్న శిశువు కిడ్నాప్ గుంటూరులో కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. జిజిహెచ్ హాస్పిటల్లో జరిగిన ఈ కిడ్నాప్ ను పోలీసులు సీరియస్ గా తీసుకున్నారు. వెంటనే రంగంలోకి దిగి హాస్పిటల్లోని సిసి కెమెరా ఫుటేజి ఆధారంగా ఎత్తుకెళ్లిన మహిళను గుర్తించారు. కేవలం 24 గంటల్లోనే కిడ్నాపర్ ఆఛూకీ కనుగొన్న పోలీసులు చిన్నారిని తిరిగి తల్లిఒడికి చేర్చారు. 

వివరాల్లోకి వెళితే... గుంటూరు పట్టణంలోని ఐపిడి కాలనీకి చెందిన రబ్బానీ భార్య రోషిని గత నెల 26న ప్రసవం కోసం జిజిహెచ్ లో చేరింది. ఆ తర్వాతి రోజు అంటే సెప్టెంబర్ 27న ఆమెకు డాక్టర్లు సిజేరియన్ చేసారు. ఇలా పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది రోషని.  

అయితే రోషినికి సిజేరియన్ కావడంతో ఐదారు రోజులుగా హాస్పిటల్లోనే వుండాల్సి వచ్చింది. ఈ క్రమంలోనే నిన్న(మంగళవారం) బిడ్డకు పాలిచ్చి పక్కనే పడుకోబెట్టుకుని తల్లి కూడా నిద్రలోకి జారుకుంది. ఈ సమయంలో వారివద్ద ఎవరూ లేకపోవడంతో ఇదే అదునుగా ఓ మహిళ చిన్నారిని కిడ్నాప్ చేసింది. కాస్సేపటికి తల్లికి మెలకువ రాగా పక్కన చిన్నారి కనిపించలేదు. దీంతో కంగారుపడిపోయిన ఆమె కుటుంబసభ్యులకు విషయం తెలిపింది. వారు హాస్పిటల్ మొత్తం వెతికినా శిశువు కనిపించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసారు.  

వీడియో

శిశువు కిడ్నాప్ ను సీరియస్ గా తీసుకున్న పోలీసులు హాస్పిటల్ సిసి కెమెరాలను పరిశీలించారు. ఓ గుర్తుతెలియని మహిళ చిన్నారిని ఎత్తుకెళుతూ కనిపించింది. ఈ వీడియో ఆధారంగా కిడ్నాపర్ ను గుర్తించి గాలింపు చేపట్టిన పోలీసులు నరసరావుపేట మండలం ఉప్పలపాడుల శిశువు వున్నట్లు గుర్తించారు. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు కిడ్నాపర్ మహిళను అదుపులోకి తీసుకుని చిన్నారిని సురక్షితంగా కాపాడారు. ఇలా పాప తిరిగి తల్లిదండ్రుల వద్దకు చేరింది. 

Read More  రేపల్లెలో కిరాతకం... స్మశాన వాటికలో డిగ్రీ విద్యార్థి దారుణ హత్య

గతంలోనూ గుంటూరు జిజిహెచ్ లో చిన్నారులు కిడ్నాప్ కు గురయిన ఘటనలు వున్నారు. దీంతో హాస్పిటల్ సెక్యూరిటీని పెంచాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. హాస్పిటల్ సిబ్బంది, చిన్నారుల తల్లిదండ్రులు నిరంతరం అప్రమత్తంగా వుండాలని కొత్తపేట పోలీసులు సూచిస్తున్నారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios