నేటి ఉదయం సోషల్ మీడియాలో నెంబర్ 4 లో జస్టిస్ ఫర్ అర్జున్ మీనా అనే ఒక హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతుంది. నాలుగవ స్థానాల్లో ఈ హాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతుంది. అర్జున్ మీనది ఆత్మహత్య కాదు, హత్య అంటూ, ఆయనకు న్యాయం జరిగేలా చూడాలంటూ ట్విట్టర్లో ట్రెండ్ చేస్తున్నారు. 

ట్విట్టర్లో వీరంతా సిబిఐ విచారణ కావాలని డిమాండ్ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని ట్యాగ్ చేస్తూ ఈ కేసు విచారణను సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేస్తున్నారు. 

ఇంతకీ ఈ అర్జున్ మీనా ఎవరంటే.... ఆంధ్రప్రదేశ్ విజయనగరం జిల్లాలోని కేంద్రీయ విద్యాలయ సంఘటన్ (కేవిఎస్) లో పని చేసే ఒక ఉపాధ్యాయుడు. 2017 నుండి విజయనగరం జిల్లాలోని జవహర్ నవోదయ విద్యాలయంలో బోధిస్తున్నాడు. 

ఇటీవల ఆయన అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఆయన మృతిని ఆత్మహత్యగా తేల్చారు ఆంధ్రప్రదేశ్ పోలీసులు. కానీ అది ఆత్మహత్య కాదు హత్యా అని అందుకు సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తూ సోషల్ మీడియాలో సిబిఐ విచారణను డిమాండ్ చేస్తున్నారు. 

రాజస్థాన్ కు చెందిన అర్జున్ మీనా గిరిజనుడు. తమ గిరిజనులకు అన్యాయం జరిగితే పట్టించుకోవడంలేదంటూ గిరిజనులు ఆవేదన చెందుతున్నారు. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం గురించి టీవీ డిబేట్లలో చర్చించి న్యాయం జరిగేలా చూడమని ఉద్యమాలు చేస్తారు కానీ, తమ అణగారిన వర్గానికి చెందినవారు మరణిస్తే పట్టించుకునే దిక్కు కూడా ఉండదా అని వారు ఆవేదన చెందుతున్నారు. 

మొన్ననే అంతర్వేది రథం తగలబడటం పై వినిపించిన సిబిఐ విచారణ డిమాండ్ మరోసారి ఏపీలో వినబడుతుంది. జస్టిస్ ఫర్ అర్జున్ మీనా అంటూ అంతా కూడా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని ఈ కేసు విచారణను సిబిఐ కి అప్పగించామని కోరుకుంటున్నారు.