నెల్లూరు: మాస్కు పెట్టుకోవాలని చెప్పినందుకుగాను మహిళా ఉద్యోగినిపై విచక్షణ రహితంగా కొట్టిన ఏపీ టూరిజం డిప్యూటీ మేనేజర్ భాస్కర్ ను పోలీసులు మంగళవారం నాడు అరెస్ట్ చేశారు.

ఏపీ టూరిజం కార్యాలయంలో  డిప్యూటీ మేనేజర్ గా  పనిచేస్తున్న భాస్కర్ కాంట్రాక్టు ఉద్యోగిని ఉషారాణిపై విచక్షణ రహితంగా దాడికి దిగాడు.

also read:మాస్కు పెట్టుకోవాలని చెప్పినందుకు మహిళా ఉద్యోగినిపై రాడ్‌తో దాడి

మాస్కు పెట్టుకోవాలని కోరినందుకు గాను మహిళా ఉద్యోగిని ఉషారాణిని భాస్కర్ తీవ్రంగా కొట్టాడు. ఈ ఘటన ఈ నెల 27వ  తేదీన చోటు చేసుకొంది. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. కార్యాలయంలోని సీసీటీవీ పుటేజీలో ఈ దృశ్యాలు రికార్డయ్యాయి. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసినా కూడ పట్టించుకోలేదని బాధితురాలు ఆరోపించారు. 

ఈ విషయమై ఇవాళ మీడియాలో కథనాలు రావడంతో పోలీసులు చర్యలు తీసుకొన్నారని బాధితురాలు మీడియాకు తెలిపారు.మీడియాలో వచ్చిన కథనాలపై ఏపీ టూరిజం మంత్రి అవంతి శ్రీనివాస్ స్పందించారు. బాధితురాలితో మంత్రి అవంతి శ్రీనివాస్  ఇవాళ ఫోన్ లో మాట్లాడారు.

నిందితుడిని ఉద్యోగం నుండి తొలగిస్తామని మంత్రి హామీ ఇచ్చారని బాధితురాలు మీడియాకు తెలిపారు. మాస్కు పెట్టుకోవాలని కోరినందుకే తనపై దాడి చేశారన్నారు. గతంలో భాస్కర్ తో తనకు ఎలాంటి గొడవలు లేవని ఆమె వివరించారు.