ప్రొటోకాల్...ప్రోటోకాల్ అంటూ నెల్లూరులో రెండు మేకలు రచ్చ చేస్తున్నాయట
నెల్లూరు జిల్లా పెద్దా రెడ్డి మౌనం వీడారు.
నెల్లూరులో రెండు మేకల రచ్చ ఎక్కువయిందని గోల చేశారు.
ఈ మేక లేమిటో తెలుసా... నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి.. ఆయన కుమారుడు ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి గౌతంరెడ్డి.
కాంగ్రెస్ ను వదిలేసి, గత 2015 డిసెంబర్ లో తెలుగుదేశం పార్టీలో చేరినప్పటి నుంచి వివేకానందరెడ్డి చాలా సౌండ్తో ప్రతిపక్షనాయకుడు జగన్మోహన్ రెడ్డి మీద విరుచకుపడుతున్నారు. తానుండేది నెల్లూరే అయినా, విజయవాడలో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి మీద ఈగ వాలకుండా చూసేవారు. ఏమయిందో ఏమో ఆమధ్య ఆయన మౌన వత్రంలోకి వెళ్లిపోయారు. ముఖ్యమంత్రితో పాటు చిన్నబాబు లోకేశ్ కు కూడా శల్యూట్ కొట్టాల్సి రావడంకొంత ఇబ్బందయి, ఏమీ పాలుపోక, ఆ మౌనంగా ఉన్నారని నెల్లూరోళ్లు చెబుతారు. పోయిన్నెలలో లోకేశ్ నెల్లూరు రాక సందర్భంగా, స్వయంగా చినబాబు కాకుండా ఎవరో పార్టీ కార్యకర్తతో ఫోన్ చేయించడం ఆయనకూ మరీ నచ్చలేదని చెబుతారు. బహుశా ఈ సమస్య సమసిపోయినట్టుంది. ఆదివారం మధ్యాహ్నం మౌనం వీడి ‘మేక’ ల మీద తీవ్రంగా దాడి చేశాడు.
ప్రొటోకాల్ ప్రోటోకాల్ అంటూ ఈ రెండు మేకలు రచ్చ చేస్తున్నాయని విమర్శలు మొఖం చిట్లించారు. ఆది వారం నెల్లూరు లోని ఎసి సెంటర్ లో నిర్వహించిన విలేకరులను పిల్చి మేకల మీద దాడిచేశారు.
“ప్రొటొకాల్ అంటే మీకు తెలుసా? అది అడిగే ముందు ఆత్మకూరు నియోజక వర్గానికి ఎంపీగా రాజమోహన్ రెడ్డి ఎంపీలాడ్స్ కింద ఎన్ని నిధులు మంజూరు చేశారో చెప్పాలా? ఆయన కొడుకు గౌతమ్ రెడ్డి పది రోజుల కోసారి ఎక్కడెక్కడో వెళ్లి ఒళ్లంతా తోమించుకొని వస్తంటుటాడు. అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభాలకు హాజరు కారు. వాటిని ఎగ్గొట్టి ప్రోటోకాల్ ప్రొటొకాల్ అంటూ ఏంది గోల,”అని వివేకానంద రెడ్డి విమర్శించారు.
ఇంకా తీవ్రవిమర్శ చేస్తూ, “ఎంపిగారు నెల్లూరు లో ఒక సన్నాసి దగ్గర సీటిస్తామని రూ.5కోట్లు తీసుకున్నారు. తర్వాత ఇంకా ఖర్చు లున్నాయని ఆ సన్నాసిని పీల్చి పిప్పి చేశాడు. ఇప్పుడు ఆ సన్నాసి గాడేమో ఊరు మీ ద పడి దండుకుంటున్నాడు,”అని కడిగేశారు.
అంతటితో ఆగకుండా, జెడ్పి ఛైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి బొమ్మాబొరుసు రెడ్డి అని ఎగతాళి చేశారు.“ఆయన పగలు వైసీపీ. రాత్రి మాతో కూర్చుంటాడు. మానాయకులతో మంతనాలు,” అని విమర్శించారు.
ధన మదంతో వైసీపీ నేతలు చేస్తున్న దౌర్జన్యాలను చూసి తట్టుకోలేక వైసీపీనిచాలా మంది వీడుతున్నారని అన్నారు. అలాగే ఆత్మకూరు మేకలు అరవడం మానేసి అభివృద్ధి కార్యక్రమాలకు హాజరైతే శిలాఫలకాలపై తమ పేర్లు ఉన్నాయో లేదో తెలుస్తుందనిచెప్పారు.
ప్రొటోకాల్ ఉల్లంఘించారంటూ వైసీపీ ఎంపీ, ఎమ్మెల్యే అసత్య ఆరోపణలు చేస్తున్నారని వివేకానందరెడ్డి పేర్కొన్నారు.
ఈ ఎంపీ మేకపాటి కి రూ.5కోట్లు ఇచ్చిన సన్నాసి ఎవరనే అందరిని వేధిస్తున్న ప్రశ్న.
ఈ సన్నాసి నేనే నని ముందుకు వచ్చి, నేనసిని కాదని ఖండిస్తాడా,
‘నన్ను సన్నాసి అని అంటావా’ అని బుసకొడతాడా చూడాలి. మరి ‘మేక’ లేమంటాయో చూద్దాం.
