MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Forecast
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Andhra Pradesh
  • Tirumala Laddu : తిరుమల లడ్డూ రికార్డు సేల్... ఈ జూన్ లో ఎన్ని అమ్ముడయ్యాయో తెలుసా?

Tirumala Laddu : తిరుమల లడ్డూ రికార్డు సేల్... ఈ జూన్ లో ఎన్ని అమ్ముడయ్యాయో తెలుసా?

ఆదాయం, భక్తుల సంఖ్యలోనే కాదు ఇప్పుడు పవిత్రమైన లడ్డూల అమ్మకాల్లోనూ తిరుమల తిరుపతి దేవస్థానం రికార్డులు నెలకొల్పుతోంది. ఈ జూన్ 2026 లో ఎన్ని లడ్డూలు అమ్మారో తెలుసా?

2 Min read
Author : Arun Kumar P
Published : Jul 03 2026, 09:30 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
తిరుమల లడ్డూ విక్రయాల్లో రికార్డు
Image Credit : TTD website

తిరుమల లడ్డూ విక్రయాల్లో రికార్డు

Tirumala Laddu : హిందువులు కలియుగ వైకుంఠంగా భావించే తిరుమలకు వెళితే ఓ నాలుగు పనులు తప్పకుండా చేస్తారు. ఒకటి ఎంత రద్దీ ఉన్నా వెంకటేశ్వరస్వామి దర్శించుకోవడం, రెండోది భక్తితో తలనీలాలు సమర్పించుకోవడం, మూడోది తోచినంత డబ్బు హుండీలో వేయడం, నాలుగోది లడ్డూ ప్రసాదం తీసుకోవడం. అయితే మొదటిమూడు తాను, తన కుంటుంబం కోసం చేస్తే నాలుగోది మాత్రం స్నేహితులు, బందువుల కోసం చేస్తారు. లడ్డూ ప్రసాదాన్ని తాము స్వీకరించడమే కాదు ఇతరులకు పంచడానికి కొంటుంటారు. కాబట్టి తిరుమలలో లడ్డూ విక్రయాలు గణనీయంగా జరుగుతుంటాయి.

అయితే ఆ వేంకటేశ్వర స్వామి పరమ పవిత్ర ప్రసాదమైన తిరుమల లడ్డూ అమ్మకాల్లో సరికొత్త రికార్డు నమోదయ్యింది. ఈ లడ్డూల విక్రయాలు జూన్ (2026) నెలలో మునుపెన్నడూ లేని స్థాయికి చేరాయి. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) లడ్డూల ఉత్పత్తిని భారీగా పెంచడమే కాకుండా, ఎక్కడా ఎలాంటి కొరత లేకుండా నిరంతరాయంగా పంపిణీ చేసింది. దీంతో భారీగా లడ్డూలు అమ్ముడయ్యాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
జూన్ లో ఎన్ని లడ్డూలు అమ్మారో తెలుసా?
Image Credit : National Geographic/Youtube

జూన్ లో ఎన్ని లడ్డూలు అమ్మారో తెలుసా?

సాధారణంగానే తిరుమల లడ్డూ విక్రయాలు ఎక్కువగా ఉంటాయి... కానీ గత కొన్ని నెలలుగా ఇది పెరుగుతూ వస్తోంది. ఈ ఏడాది ఏప్రిల్, మే నెలలో భారీగా లడ్డూ విక్రయాలు జరిగాయి... ఇదే రికార్డు అనుకుంటే జూన్ దీన్ని మించిపోయే అమ్మకాలు జరిగాయి. జూన్ నెలలో లడ్డూల విక్రయాలు గణనీయమైన వృద్ధిని సాధించాయి... ఆల్ టైమ్ రికార్డు నమోదయ్యింది.

ఏప్రిల్ 2026 : 1,11,96,170 లడ్డూల విక్రయం

మే 2026 : 1,21,35,528 లడ్డూల విక్రయం

జూన్ 2026 : 1,26,81,805 లడ్డూల విక్రయం

Related Articles

Related image1
Tirumala : రూ.300 దర్శన టికెట్స్ దొరకలేవా? నెలరోజుల్లోపే ఇదే క్యూలైన్ లో వెళ్లి శ్రీవారిని దర్శించుకునే సూపర్ ట్రిక్
Related image2
Tirupati Temple : తిరుమల గర్భగుడిలో శ్రీవారి మూలవిరాటే కాదు ఇంకా ఏమేం ఉంటాయో తెలుసా? వీటిని కూడా దర్శించుకుంటే పుణ్యఫలం
34
తిరుమల లడ్డూ అమ్మకాల్లో భారీ వృద్ధి
Image Credit : National Geographic/Youtube

తిరుమల లడ్డూ అమ్మకాల్లో భారీ వృద్ధి

గత రెండు సంవత్సరాల జూన్ నెలల గణాంకాలతో పోల్చి చూస్తే.. ఈ ఏడాది జూన్‌లో లడ్డూల విక్రయం ఒక మైలురాయిగా నిలిచింది. ప్రతి ఏటా లడ్డూల విక్రయాలు పెరుగుతున్నాయే తప్ప తగ్గడంలేదు... దీన్ని బట్టి తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య కూడా పెరుగుతోందని స్పష్టంగా అర్థమవుతోంది.

జూన్ 2024 అమ్మకాలు : 1,02,64,364

జూన్ 2025 అమ్మకాలు : 1,19,21,353

జూన్ 2026 అమ్మకాలు : 1,26,81,805 

గత ఏడాదితో జూన్ అమ్మకాలతో పోలిస్తే ఈసారి అదనంగా 7,59,452 లడ్డూలు అమ్ముడయ్యాయి. ఇది 6.37% వృద్ధిని సూచిస్తుంది. రెండేళ్ల క్రితం (2024 జూన్) తో పోలిస్తే ఏకంగా 24,17,441 లడ్డూలు అదనంగా విక్రయించారు. అంటే 23.55% భారీ వృద్ధి నమోదైంది.

44
తిరుమల లడ్డూ విక్రయాల పెరుగుదలకు కారణమేంటి?
Image Credit : Asianet News

తిరుమల లడ్డూ విక్రయాల పెరుగుదలకు కారణమేంటి?

శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో.. లడ్డూ ప్రసాదం తయారీ, పంపిణీలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా టీటీడీ అధికారులు పక్కా ప్రణాళికలతో వ్యవహరిస్తున్నారు. భక్తులందరికీ స్వామివారి ప్రసాదం తృప్తిగా అందేలా చర్యలు తీసుకుంటున్నారు… లడ్డూల ఉత్పత్తి పెంచారు. అందుకే విక్రయాలు కూడా గణనీయంగా పెరుగుతున్నాయి. 

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
ఆంధ్ర ప్రదేశ్
తిరుపతి
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Now Playing
బంగాళాఖాతంలో వరుస అల్పపీడనాలు..ఏపీలో వర్షాలు స్టార్ట్ | Asianet News Telugu
Recommended image2
Weather Update : బంగాళాఖాతంలో వరుస అల్పపీడనాలు.. మరి వర్షాలు ఎక్కడ? ఎప్పట్నుంచి కురుస్తాయి?
Recommended image3
Now Playing
చెంచాగాళ్లెవరు లోకేష్ పై రెచ్చిపోయిన పేర్ని నాని | Perni Nani Sensational Comments on Nara Lokesh
Related Stories
Recommended image1
Tirumala : రూ.300 దర్శన టికెట్స్ దొరకలేవా? నెలరోజుల్లోపే ఇదే క్యూలైన్ లో వెళ్లి శ్రీవారిని దర్శించుకునే సూపర్ ట్రిక్
Recommended image2
Tirupati Temple : తిరుమల గర్భగుడిలో శ్రీవారి మూలవిరాటే కాదు ఇంకా ఏమేం ఉంటాయో తెలుసా? వీటిని కూడా దర్శించుకుంటే పుణ్యఫలం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved