షికారుకు తీసుకెళ్లి బట్టలిప్పి షాకిచ్చిన ప్రియుడు, ఆమె ఏం చేసిందంటే?

Nellore student complaint against lover for sexual harassment
Highlights

 ప్రేమ పేరుతో  ఓ యువతిని మోసం చేసి ఆమె నగ్న చిత్రాలను  తీసి బ్లాక్‌మెయిల్‌కు పాల్పడుతున్న  ఓ యువకుడిపై బాధితురాలు  పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు  చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.  ఈ ఘటన నెల్లూరు జిల్లాలో చోటు చేసుకొంది.


నెల్లూరు: ప్రేమ పేరుతో  ఓ యువతిని మోసం చేసి ఆమె నగ్న చిత్రాలను  తీసి బ్లాక్‌మెయిల్‌కు పాల్పడుతున్న  ఓ యువకుడిపై బాధితురాలు  పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు  చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.  ఈ ఘటన నెల్లూరు జిల్లాలో చోటు చేసుకొంది.

నెల్లూరు  జిల్లా  వేదాయపాలెంలో  ఇంటర్మీడియట్  చదువుతున్న ఓ యువతికి అదే ప్రాంతానికి చెందిన పి. మోహన్‌కుమార్‌తో పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం ప్రేమగా మారింది.ఇద్దరూ కూడ వివాహం చేసుకోవాలని నిర్ణయం తీసుకొన్నారు. 

ఈ నిర్ణయంతో యువతిని  ఏడాదిన్నర క్రితం  కారులో బయటకు తీసుకెళ్లాడు.  తమ వెంట తినుబండారాలు తీసుకెళ్లాడు. తినుబండారాలు తిన్న  తర్వాత మత్తు కలిపిన బాదంపాలను యువతికి ఇచ్చాడు.ఈ  పాలను తాగిన యువతి మత్తులోకి జారుకొంది.

 మత్తులోకి జారుకొన్న యువతిని మోహన్ కుమార్  నగ్నంగా వీడియోలు, ఫోటోలు తీశాడు.  ఆ తర్వాత ఏమి తెలియనట్టుగానే బాధితురాలిని ఆమె ఇంటి వద్ద వదిలేశాడు. అయితే ఈ ఫోటోలు, వీడియోలను చూపించిన  బాధితురాలి నుండి పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేశాడు.

అంతేకాదు  మరోవైపు  లైంగిక వాంఛ తీర్చాలని బాధితురాలిని వేధింపులకు గురిచేశాడు. అలా చేయకపోతే  నగ్న ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియాలో పెడతానని బాధితురాలిని వేధించాడు. దీంతో  బాధితురాలు కుటుంబసభ్యుల సహాయంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.


 

loader