నెల్లూరు రూరల్ వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి సంబంధించి ఓ ఆడియో టేపు ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనం కలిగిస్తోంది. ఓ జర్నలిస్టును చంపేస్తానంటూ శ్రీధర్ రెడ్డి ఫోన్‌లో బెదిరించినట్లుగా టీడీపీ నేత నారా లోకేశ్ ట్వీట్టర్‌లో ఓ ఆడియో టేప్ పోస్ట్ చేశారు.

నాపైనే పోస్టింగ్‌లు పెడతావా..? అంటూ కోటంరెడ్డి ఓ విలేకరిని అసభ్యపదజాలంతో దూషించారు. ‘‘ నీ తోలు తీస్తా.. నీ దిక్కున్నచోట చెప్పుకో.. నీవేమైనా పెద్ద తోపువా.. అంతా రికార్డు చేసుకో.. నిన్ను నడిరోడ్డుపై నరికేస్తా.. నిన్ను ఎవరు కాపాడతారా చూస్తా.. నీ ఇంటికే వస్తా, దమ్ముంటే టైమ్ చెప్పు అంటూ శ్రీధర్ రెడ్డి విలేకరిని ఫోన్‌లో బెదిరించారు.

దీనిపై లోకేశ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈ రాక్షస రాజ్యంలో జర్నలిస్టుల పరిస్థితి ఇదైతే ఇక సామాన్యుడి పరిస్ధితి ఎలా ఉండబోతోందో మీరే ఊహించుకోండి అంటూ ట్వీట్ చేశారు.