వచ్చే సోమవారం లోపు నెల్లూరు శివార్లలోని దళిత బస్తీల అభివృధ్ది పనులను ప్రారంభించకపోతే, మునిసిపల్ కార్యాలయంలోనే ఆమరణ నిరాహార దీక్ష చేస్తా. మీచేత కాకపోతే, నిధులివ్వండి, నేను 60 రోజుల్లో పనులు పూర్తి చేస్తా. లేదంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా...

గత రెండు రోజులుగా నెల్లూరు రూరల్ రాజకీయం చాలా హాట్ హాట్ గా నడుస్తూ ఉంది. రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి(వైసిపి) అధికారులను, మున్సిపల్ మంత్రి నారాయణ ను అక్షరాల పరిగెత్తిస్తున్నారు. ఈ రోజు ఆయన మరొక అల్టిమెటమ్ జారీ చేశారు. వచ్చే సోమవారం లోపు నెల్లూరు శివార్లలోని దళిత బస్తీల అభివృధ్ది పనులను ప్రారంభించకపోతే, మునిసిపల్ కార్యాలయంలోనే ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని అల్టిమేటమ్ ఇచ్చారు. 

జివొ ప్రకారం నిధులు విడుదల యిన 60 రోజులలో పనులు పూర్తి చేయాలని, ఈ విషయం లో మునిసిపల్ మంత్రి పూర్తిగా విఫలమయ్యారని అన్నారు. దీనివల్ల పేదలు బతికే ప్రాంతాలలో వసతులు లేకుండ పోయాయని అంటూ ఎన్నికోట్ల నిధులిచ్చినా తాను 60 రోజుల్లో పూర్తి చేయిస్తానని, అలాకాని పక్షంలో ’ అమ్మతోడు , ఎమ్మెల్యే పదవికి రాజీనామా’చేస్తానని, ఈ సవాల్ ను స్వీకరించాలని మంత్రిని కోరారు. అంతేకాదు, ఈపనులు చేయించింది తానే నని మంత్రి చెప్పుకోవచ్చని కూడ సలహా ఇచ్చారు. ఈ సవాళ్లతో మునిసిపల్ అధికారులుజడిసిపోతున్నారు. ఎందుకంటే, శ్రీధర్ రెడ్డి అన్నంత పరిచేస్తారు. మరి ప్రభుత్వానికి మాత్రం రూరల్అభివృద్ధి అంతముఖ్యమయిన విషయం కాదు. ఎలా?

ఇది శ్రీధర్ రెడ్డి చేసిన మూడో హెచ్చరిక. రెండు రోజుల కిందట ఆయన తన నియోజకవర్గాన్ని ప్రభుత్వం ఎలా నిర్లక్ష్యం చేస్తున్నదో బయటపెట్టి, ప్రభుత్వం విడుదల చేసిననిధుల వెంటనే ఖర్చుచేయాల్సిందేనని హెచ్చరించారు. దీనిమీద ఒక ప్రకటన చేసే దాకా వదలనని మొండికేశారు. ప్రకనట చేసేదాకా తాను మునిసిపల్ కార్యాలయంలో కమిషన్ ఛేంబర్లో దీక్ష చేపడతానని హెచ్చరించారు. అనుకున్నట్లు ఆయన సోమవారం మునిసిపల్ కార్యాలయానికి వస్తే, కమిషనర్ లేరు. అందువల్ల కార్యాలయం బయట దీక్ష ప్రారంభించారు. ఈ సమస్య పెద్దదయ్యే ప్రమాదం ఉండటంతో కమిషన్ పరిగెత్తూ కుంటూ వచ్చివారం రోజుల్లో పనులు ప్రారంభిస్తామని చెప్పారు. వారంరోజల్లో ప్రారంభించకపోతే, ఆమరణ నిరాహారదీక్షకు పూనుకుంటానని హెచ్చరించారు.

 అసలు గొడవేమిటో ఆయన నెల్లూరు నుంచి ఏసియా నెట్ కు వివరించారు.

నెలూరు రూరల్ నియోజకవర్గంలో దాదాపు 130 దళితవాడలున్నాయి. అక్కడ దాదాపు లక్షమంది ప్రజలు నివసిస్తున్నారు. ఈ ప్రాంతాలలో వసతులు మెరుగుపరిచేందుకు ప్రభుత్వం రు. 50 కోట్లు మంజూరుచేసింది . టెండర్లను పిలిచారు.అయితే పనులు ప్రారంభంకాలేదు. తెలుగుదేశం నాయకులు భారీగా కమిషన్లు డిమాండ్ చేయడంతో కాంట్రాక్టర్లు పనులు గిట్టుబాటు కావని వదిలేశారని ఆయన ఆరోపించారు. సాధారణంగా 60 రోజుల్లో పూర్తి చేయాల్సిన పనులు 200 రోజులు పెడింగులో ఉన్నాయి. అయితే, ప్రభుత్వానికి చీమకుట్టినట్లు కూడ లేదు. కారణం, ఈ నిధులను తాను అనేక సార్లు మునిపల్ శాఖ చుట్టూ తిరిగి విడుదల చేయించుకున్నాను. అక్కడసమస్య ఉంది. నిధులు తెచ్చుకున్నది అపోజిషన్ ఎమ్మెల్యే. పనులు జరిగేది అపోజిషన్ నియోజకవర్గంలో. అందుకే, చట్ట ప్రకారం 60 రోజుల్లో పూర్తి చేసి తీరాల్సిన పనులను 200 రోజులయిన చేపట్టడం లేదని శ్రీధర్ రెడ్డి విమర్శిస్తున్నారు.

ఇదే 14 వ ఫైనాన్స్ కమిషన్ పనులకు కూడా టెండర్లు పిలవలేదని ఆయన ఏషియానెట్ కు చెప్పారు. ‘ నేను దీక్ష అని బెదిరించే సరికి ఈ పనులకు కూడా టెండర్లు పిలిచారు’ అని ఆయన చెప్పారు.

మునిసిపల్ మంత్రి నారాయణ సొంత వూర్లో పరిస్థితి ఇదని ఆయన చెప్పారు.

మంత్రికి కూడా ఆయనొ క సవాల్ విసిరారు. పట్టణానికి వందకోట్లు, కాదు రెండు వందల కోట్ల నిధులు విడుదల చేసినా, మంత్రిగా నారాయణ చేయలేకపోయిన పనులను 60 రోజులు పూర్తి క్వాలిటీతో పనులు చేయిస్తానని చెప్పారు. అలా చేయలేని పక్షంలో ’ అమ్మతోడు, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తాను,’అని సవాల్ విసిరారు.