వైసీపీలో చేరిన టీడీపీ ఎమ్మెల్యేలతో రాజీనామాలు చేయించండి: వైసీపీకి కోటంరెడ్డి కౌంటర్

వచ్చే ఎన్నికల్లో తాను  టీడీపీ నుండి  పోటీ చేయాలని భావిస్తున్నట్టుగా  నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే  కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి  చెప్పారు.  

Nellore Rural MLA Kotamreddy Sridhar Reddy  Reacts  On YCP Comments

నెల్లూరు: టీడీపీలో విజయం సాధించి వైసీపీలో  చేరిన  ఎమ్మెల్యేలు  రాజీనామాలు చేసిన  తర్వాత తన రాజీనామా గురించి మాట్లాడాలని  నెల్లూరు రూరల్  ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి   వైసీపీ నేతలకు సూచించారు. 

శుక్రవారం నాడు  నెల్లూరు రూరల్  ఎమ్మెల్యే  కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి  మీడియాతో మాట్లాడారు. వైసీపీలో  చేరిన టీడీపీ ఎమ్మెల్యేలు స్పీకర్ ఫార్మెట్ లో  రాజీనామాలు  సమర్పించిన తర్వాత  తన రాజీనామా గురించి  వైసీపీ నేతలు కోరడంలో  అర్ధం ఉందన్నారు.

also read:వైసీపీ నుండి మళ్లీ పోటీ చేయను, ఆర్నెళ్లలో చిత్ర విచిత్రాలు: కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి

అధికారం అనుభవించి  చివర్లో బయటకు వెళ్లడం తనకు  ఇష్టం లేదన్నారు.  ఈ కారణంగానే  ఎన్నికలకు  ఏడాది ముందే  వైసీపీకి దూరంగా  ఉండాలని నిర్ణయం తీసుకున్నట్టుగా  చెప్పారు.  వచ్చే ఎన్నికల్లో తాను టీడీపీ నుండి పోటీ చేయాలని భావిస్తున్నట్టుగా  చెప్పారు. అయితే  ఈ విషయమై  చంద్రబాబు నిర్ణయం తీసుకోవాలన్నారు.  అదాల ప్రభాకర్ రెడ్డి  ఇష్టమొచ్చినట్టుగా  మాట్లాడుతున్నారని  కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మండిపడ్డారు.  

వైఎస్ జగన్ మంత్రివర్గంలో  చోటు దక్కుతుందని  కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి భావించారు. అయితే  శ్రీధర్ రెడ్డికి మంత్రివర్గంలో  చోటు దక్కలేదు.   తొలిసారి అనిల్ కుమార్ యాదవ్ కు, రెండో దఫా కాకాని గోవర్ధన్ రెడ్డికి  మంత్రివర్గంలో  చోటు దక్కింది. మంత్రివర్గంలో  చోటు దక్కని కారణంగా  కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అసంతృప్తికి గురయ్యారు .  సామాజిక సమీకరణాల నేపథ్యంలో  మంత్రివర్గంలో  చోటు కల్పించలేకపోయినట్టుగా  వైసీపీ నాయకత్వం శ్రీధర్ రెడ్డికి సమాచారం ఇచ్చింది. 

అయితే  ఇటీవల కాలంలో  అధికారల తీరుపై  కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తీవ్ర విమర్శలుగ చేశారు. దంతో   శ్రీధర్ రెడ్డిని పిలిపించి మాట్లాడారు.  ఆ తర్వాత  కొన్ని రోజులు మౌనంగానే  కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఉన్నారు. మరో వైపు  తన ఫోన్ ను ట్యాపింగ్  చేస్తున్నారని   కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి  ఆరోపణలు చేశారు. ఫోన్ రికార్డింగ్  ను ఫోన్ ట్యాపింగ్ అంటూ  కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి  తప్పుడు అంటూ   ప్రచారం చేస్తున్నారని వైసీపీ నేతలు మండిపడుతున్నారు.  

టీడీపీలో చేరాలనే ఉద్దేశ్యంతో  కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వైసీపీపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని  వైసీపీ ఎదురుదాడికి దిగుతుంది.  వైసీపీ నెల్లూరు రూరల్ అసెంబ్లీ నియోజకవర్గ బాధ్యతల నుండి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని తప్పించి  మాజీ మంత్రి అదాల ప్రభాకర్ రెడ్డికి అప్పగించారు.  

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios