కారణమిదీ: నెల్లూరులో ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి హౌస్ అరెస్ట్

నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే  కోటంరెడ్డి  శ్రీధర్ రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్  చేశారు.తన నియోజకవర్గంలోని  గాంధీనగర్ లో  క్రిస్టియన్ కమ్యూనిటీ హల్ నిర్మాణం కోసం   నెల్లూరు  రూరల్ ఎమ్మెల్యే  నిరసనకు దిగుతానని  ప్రకటించిన విషయం  తెలిసిందే.

Nellore  Rural  MLA  Kotamreddy  Sridhar Reddy  House  Arrested  lns


నెల్లూరు:  వైసీపీ నుండి సస్పెన్షన్ కు గురైన  నెల్లూరు  రూరల్   ఎమ్మెల్యే  కోటంరెడ్డి  శ్రీధర్ రెడ్డిని  పోలీసులు మంగళవారంనాడు  హౌస్ అరెస్ట్  చేశారు. నెల్లూరు  రూరల్ అసెంబ్లీ నియోజకవర్గంలోని  గాంధీనగర్ లో క్రైస్తవ  కమ్యూనిటీ  హల్  నిర్మాణానికి  నిధుల విషయమై   కోటంరెడ్డి  శ్రీధర్ రెడ్డి  ఇవాళ  నిరసనకు పిలుపునిచ్చారు.  దీంతో  కోటంరెడ్డి  శ్రీధర్ రెడ్డి   పోలీసులు  ఇవాళ హౌస్ అరెస్ట్  చేశారు.  శాంతియుతంగా  నిరసనకు దిగిన  పోలీసులు  తనను  హౌస్ అరెస్ట్  చేయడాన్ని  కోటంరెడ్డి  శ్రీధర్ రెడ్డి తప్పుబట్టారు. 

క్రైస్తవ  కమ్యూనిటీ  హల్ నిర్మాణానికి నిధులివ్వాలని  ప్రభుత్వాన్ని  డిమాండ్  చేశారు  కోటంరెడ్డి  శ్రీధర్ రెడ్డి. తాను  శాంతియుతంగానే  నిరసనకు దిగుతానని  ఎమ్మెల్యే  చెప్పారు. తాను  ఎలాంటి విధ్వంసం  సృష్టించడం లేదన్నారు.ఎంత  అణచివేసినా వెనుకడుగు వేయబోమని ఎమ్మెల్యే  కోటంరెడ్డి  శ్రీధర్ రెడ్డి  తేల్చి  చెప్పారు. 

  నెల్లూరు రూరల్  ఎమ్మెల్యే  కోటంరెడ్డి  శ్రీధర్ రెడ్డిపై  వైసీపీ నాయకత్వం  సస్పెన్షన్ వేటు వేసిన విషయం తెలిసిందే.  వైసీపీ నాయకత్వం  సస్పెన్షన్ వేటు వేయకముందు నుండి  కూడా  కోటంరెడ్డి  శ్రీధర్ రెడ్డి  పలు  రకాలుగా  నిరసనకు దిగిన విషయం తెలిసిందే.  

అధికార పార్టీ  ఎమ్మెల్యేగా  ఉండి కూడా  సమస్యల  పరిష్కారం కోసం   నిరసనకు దిగాల్సిన  పరిస్థితులు  నెలకొన్నాయని  నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే  కోటంరెడ్డి  శ్రీధర్ రెడ్డి గతంలో  ఆరోపణలు  చేసిన విషయం తెలిసిందే.  మరో వైపు   గతంలో  చంద్రబాబునాయుడు  సీఎంగా  ఉన్న సమయంలో కూడా  తన నియోజకవర్గంలో  సమస్యల పరిష్కారం  కోసం  కోటంరెడ్డి  శ్రీధర్ రెడ్డి  నిరసనకు దిగిన విషయం తెలిసిందే. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios