Asianet News TeluguAsianet News Telugu

పాపం, ఆనం బ్రదర్స్...

నిన్న కొత్త మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి నెల్లూరులో బ్రహ్మాండమయిన ర్యాలీ, బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఆయన అన్ని వర్గాలను కలుపుకునే ప్రయత్నం చేశారు. కార్యక్రమానికి అందరు హాజరయ్యేలా జాగ్రత్త పడ్డారు. అయితే, ర్యాలీ లో  ప్రముఖంగా కనిపించని వాళ్లిద్దరే... అనం బద్రర్స్. మూడో వ్యక్తి ఆదలప్రభాకర్ రెడ్డి రాకపోయినా అదంతా చర్చనీయాంశం కాలేదు.

nellore Anam brothers skip the new minister Somireddys rally and public meeting

కాంగ్రెస్ నుంచి టిడిపిలోకి పెద్ద నోటితో వచ్చినా, చిన్నబోవాల్సి వచ్చిన ముగ్గురు పెద్ద రెడ్డ తమాషా చూడండి. ఈ ముగ్గురెవరనుకుంటున్నారు, తాడిప్రతి జెసి దివాకర్ రెడ్డి( అనంతపురం ఎంపి), నెల్లూరు కు చెందిన ఆనం  రామ్ నారాయణ రెడ్డి (మాజీ మంత్రి), ఆనం వివేకానందరెడ్డి (మాజీ ఎమ్మెల్యే).  నాలుక వారి కత్తి. టిడిపిలోకి వచ్చాక  కత్తి సాము అద్భుతంగా చేసిన పరిణామాలేవీ వీరికి రాజకీయంగా లాభంగా లేవు.  దీనితో పెద్దారెడ్డిలే అయినా, చిన్నారెడ్డిల్లాగా మారిపోయారు. ఇపుడు తాజాగా ఆనం బద్రర్స్ సంగతి చూద్దాం.

సోమిరెడ్డి స్వయంగా ఆహ్వానించినా ఆనం వివేకానందరెడ్డి, ఆనం రాంనారాయణ్ రెడ్డి  ర్యాలీ కి రాకపోవడం రాజకీయం అంటున్నారంతా. నెల్లూరు జిల్లాకే చెందిన మంత్రి నారాయణ మాత్రం చివరిదాకా ఉన్నారు. జిల్లానలుమూలలనుంచి  పార్టీ సీనియర్లను, ద్వితీయ శ్రేణి నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

 

తెలుగుదేశం పార్టీ 2004 నుంచి 2014 దాకా అధికారం లేదు. 2014లో అధికారంలోకి వచ్చినా సోమిరెడ్డికి మంత్రి పదవి దక్కలేదు. ఆ పదవి నారాయణ విద్యాసంస్థల అధినేత నారాయణ ఎమ్మెల్యే కాకపోయినా ఎగరేసుకుపోయారు. .దీనితో  సోమిరెడ్డి పార్టీ అధికార ప్రతినిధిగా కొన్నాళ్లు, తర్వాత ఎమ్మెల్సీ గా మరి కొన్నాళ్లు ఉన్నారు. ఈ మధ్యలో ఆయన భారీగా ఆస్తులు కూడబెట్టుకున్నారని, విదేశాలలో బినామీ కంపెనీలు, ఆస్తులున్నాయని వైసిపి నేత ఆరోపించారు. అయితే, సోమిరెడ్డి ఈ ఆరోపణలనుంచి బయటపడటమేకాకుండా ఈ ఆరోపణలు చేసిన  వైసిపి నేత గోవర్ధన్ రెడ్డి చిక్కుల్లో పడేలా చేశారు. ఇపుడు మంత్రి పదవి కూడా దక్కింది. అంటే, పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు సోమిరెడ్డి మీద బాగా నమ్మకంతో నే ఉన్నాడని అర్ధమవుతుంది. దీనికి ఇటీవల తెలుగుదేశం పార్టీకి జిల్లాలో తగిలిన కొన్ని ఎదురు దెబ్బలు సోమినేనికి బాగా ఉపయోగపడ్డాయని చెబుతారు. ఈ మధ్యజరిగిన పట్టభద్రులు, ఉపాధ్యాయుల నియోజకవర్గం ఎమ్మెల్సీ ఎన్నికలలో పార్టీ వోడిపోయింది. దీనికి తోడు స్థానికి సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలలో క్రాస్ వోటింగ్ జరిగింది. దీనితో మరొకనాయకుడు అవసరమని, ఉన్నవారితో పనులు జరగడంలేదని అధినేత చంద్రబాబు భావించారని, దీని ఫలితమే న సోమిరెడ్డికి  మంత్రి పదవి అని చెబుతున్నారు. ఇది మునిసిపల్ మంత్రి నారాయణకు కొంత ఇబ్బంది కల్గించి  నారాయణ బాగా లౌక్యంగా  వ్యవహరించారు. తన అసంతృప్తి ఎక్కడా బయటపడకుండా ఆయన ర్యాలీ సభలో చివరి దాకా ఉన్నారు.

 

ఈ పరిణామం ఆనం బ్రదర్స్ కు నచ్చినట్లు లేదు. కార్యక్రమాన్ని ఎగ్గొటి తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు.

 

కాంగ్రెస్ వదిలి టిడిపి లో చేరినప్పటినుంచి జిల్లాలో  ఎప్పటినుంచో ఉన్న సీనియర్ తెలుగుదేశం నాయకులంటే ఎక్కువగా ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి మీద దాడిచేశారు.ఈ విషయంలో వారు మరొక రాయలసీమ రెడ్డి జెసి దివాకర్ రెడ్డి ని కూడా మించి పోయారు.అయినా,  పెద్దగా ఫలితం రాలేదు.

 

మంత్రి అయింతర్వాత సోమిరెడ్డి  స్వయంగా ఫోన్ చేసి  సన్మాన ర్యాలీకి, బహిరంగ సభలకు రావాలని ఆహ్వానించారు. అంతేకాదు,తన సన్నిహితులను ఆనం, ఆదల ప్రభాకర్ రెడ్డి ఇళ్లకు పంపించి కూడా ఆహ్వానం అందచేశారు.బీద  రవిచంద్ర ఆనం వారి ఇళ్లకు వెళ్లి ప్రత్యేక ఆహ్వానం అందించారు. అయినా సరే శుక్రవారం వూర్లో వుండకుండా రామ్ నారాయణ్ రెడ్డి హైదరాబాద్ బయలు దేరారు. వివేకానందరెడ్డి వూర్లో ఉన్నా ర్యాలీకి గాని, తన ఇంటి పక్కనే ఉన్న నర్తకి సంటర్ లో జరిగిన సభకు గాని రాలేదు. మాజీ  మంత్రి ఆదల ప్రభాకర్ రెడ్డి రాష్ట్రంలోనే లేడని సమాచారం. ఈ ముగ్గురిక పార్టీలో ఉండలేరు, బయటకు పోలేరని అంటున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios