Asianet News TeluguAsianet News Telugu

ఏపీ కొత్త ఎస్ఈసీగా నీలం సాహ్ని... జగన్ సిఫారసుకు గవర్నర్ ఆమోదముద్ర

ఆంధ్రప్రదేశ్ కొత్త ఎస్ఈసీకి మాజీ సీఎస్ నీలం సాహ్నిని ప్రభుత్వం నియమించింది. ఆమెను ఎస్ఈసీగా నియమించాలన్న ఏపీ ప్రభుత్వ ప్రతిపాదనకు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆమోదముద్ర వేశారు.

Neelam Sahani appointed as AP new SEC ksp
Author
Amaravathi, First Published Mar 26, 2021, 9:02 PM IST

ఆంధ్రప్రదేశ్ కొత్త ఎస్ఈసీకి మాజీ సీఎస్ నీలం సాహ్నిని ప్రభుత్వం నియమించింది. ఆమెను ఎస్ఈసీగా నియమించాలన్న ఏపీ ప్రభుత్వ ప్రతిపాదనకు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆమోదముద్ర వేశారు.

ప్రస్తుతం సీఎం జగన్ ముఖ్య సలహాదారుగా వ్యవహరిస్తున్నారు నీలం సాహ్ని. ప్రస్తుతం ఎస్ఈసీగా వ్యవహరిస్తున్న నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ఈ నెలాఖరున పదవీ విరమణ చేయనున్నారు.

తాజా నియామకంతో ముఖ్య సలహాదారు పదవికి రాజీనామా చేసి ఎస్ఈసీగా బాధ్యతలు చేపట్టనున్నారు సాహ్ని. కాగా, కొత్త ఎస్‌ఈసీ కోసం గవర్నర్‌కు మూడు పేర్లు సిఫారసు చేసింది ఏపీ ప్రభుత్వం. వీరిలో నీలం సాహ్ని, ప్రేమచంద్రారెడ్డి, శామ్యూల్ పేర్లు వున్నాయి. 

1984వ ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన సాహ్ని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో.. మచిలీపట్నంలో అసిస్టెంట్ కలెక్టర్‌గా పని చేశారు. టెక్కలి సబ్ కలెక్టర్‌గా, నల్గొండ జిల్లా జాయింట్ కలెక్టర్‌గా పని చేశారు.

మున్సిపల్ పరిపాలన విభాగం డిప్యూటీ సెక్రటరీగా, స్త్రీ శిశు సంక్షేమశాఖ పీడీగా పని చేశారు. నిజామాబాద్, ఖమ్మం జిల్లాల్లోనూ పని చేసిన సాహ్ని.. నల్గొండ జిల్లా కలెక్టర్‌గా, కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్‌గా విధులు నిర్వర్తించారు.

కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సంయుక్త కార్యదర్శిగా పని చేశాక.. ఎపీఐడీసీ కార్పొరేషన్ వీసీ అండ్ ఎండీగా ఉమ్మడి రాష్ట్రంలో పని చేశారు. అనంతరం స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శిగా పనిచేశారు. 2018 నుంచి ఇటీవలి వరకు కేంద్ర సామాజిక న్యాయం మరియు సాధికారత కార్యదర్శిగా పనిచేశారు.

Follow Us:
Download App:
  • android
  • ios