బాలకృష్ణ గెలిస్తే అరగుండు గీయించుకుంటా

బాలకృష్ణ గెలిస్తే అరగుండు గీయించుకుంటా

వచ్చే ఎన్నికల్లో హిందుపురం నియోజకవర్గంలో నందమూరి బాలకృష్ణ మళ్ళీ గెలిస్తే తాను అరగుండు గీయించుకుంటానంటూ వైసిపి నేత ఛాలెంజ్ చేస్తున్నారు. 2014 ఎన్నికల్లో టిడిపి అభ్యర్ధిగా బాలకృష్ణ పోటీ చేయగా, వైసిపి తరపున నవీన్ నిశ్చల్ పోటీ చేశారు. అయితే, బాలకృష్ణ  ఘనవిజయం సాధించారు. సరే, గెలిచిన తర్వాత నియోజకవర్గం వైపు పెద్దగా తొంగి చూసింది లేదనకోండి అది వేరే సంగతి. నియోజకవర్గం మొత్తాన్ని పిఏ శేఖర్ చేతిలో పెట్టటంతో పార్టీ బాగా కంపైపోయింది. బాలకృష్ణపై చాలా త్వరగా వ్యతరేకత వచ్చేసింది. చివరకు పార్టీలో బాలకృష్ణకు వ్యతిరేకంగా పెద్ద తిరుగుబాటే మొదలైంది.

ఎప్పుడైతే నేతలందరూ రాజీనామా బాట పట్టారో అప్పుడు చంద్రబాబునాయుడు, బాలకృష్ణ మేల్కొన్నారు. వెంటనే, పిఏని తొలగించారు. అప్పటి నుండి ఏదో మొక్కుబడిగా హిందుపురంకు వెళుతున్నారు. అయితే, జనాల్లో మాత్రం బాలకృష్ణ పై వ్యతిరేకత ఏమాత్రం తగ్గలేదు.

సరే, ప్రస్తుత విషయానికి వస్తే, వచ్చే ఎన్నికల్లో తనకు గనుక పార్టీ టిక్కెట్టు కేటాయిస్తే కచ్చితంగా తనదే గెలుపంటూ నవీన్ ధీమా వ్యక్తం చేసారు. ఒకవేళ మళ్ళీ బాలకృష్ణే గనుక గెలిస్తే తాను అరగుండు గీయించుకుంటానని ప్రకటించటం సంచలనంగా మారింది. సమస్యల పరిష్కారం చేయలేపుడు ఎంఎల్ఏగా బాలకృష్ణ ఎందుకు పోటీ చేయాలంటూ నిలదీసారు. బాలకృష్ణ గెలుపు ఓ గెలుపే కాదంటూ తీసి పడేసారు. సరే, ఇన్ని చెబుతున్న నవీన్ ఓ విషయం మరచిపోయినట్లున్నారు. ఏపిలో టిడిపికి కంచుకోటలుగా ఉన్న నియోజకవర్గాల్లో హిందుపురం కూడా ఒకటి. 1983లో టిడిపి  ఏర్పాటైనప్పటి నుండి హిందుపురం నియోజకవర్గంలో టిడిపికి ఓటమన్నదే లేదన్న విషయం గుర్తుంచుకోవాలి. మరి, ఈ విషయం తెలీకుండానే నవీన్ ఛాలెంజ్ చేస్తున్నారా ?

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos