చంద్రబాబుకు షాకిచ్చిన జాతీయ మీడియా

చంద్రబాబుకు షాకిచ్చిన జాతీయ మీడియా

చంద్రబాబునాయుడుకు ఢిల్లీ మీడియా షాకుల మీద షాకులిచ్చింది.  ఇప్పటి వరకూ టిడిపికి మద్దతుగా నిలిచే మీడియాతో ఆడిందే ఆటగా పాడిందే పాటగా నెట్టుకొచ్చిన చంద్రబాబు ఢిల్లీ మీడియా దెబ్బకు చేతులెత్తేశారు. ప్రత్యేకహోదా, కేంద్రంపై అవిశ్వాసానికి మద్దతు కూడగట్టటమే లక్ష్యంగా చివరి నిముషంలో చంద్రబాబు ఢిల్లీలో మకాం వేసిన సంగతి అందరికీ తెలిసిందే.

మంగళవారం ఉదయం నుండి పార్లమెంటులో వివిధ పార్టీల నేతలతో బిజీగా గడిపిన చంద్రబాబు మధ్యాహ్నంపైన మీడియాతో సమావేశమయ్యారు. అక్కడే చంద్రబాబుకు చుక్కలు కనబడ్డాయి. ప్రత్యేకహోదా కోసం తాను చేస్తున్న కృషిని, అవిశ్వాస తీర్మానానికి తాను కూడగడుతున్న మద్దతును గొప్పగా చెప్పుకోవాలన్నది చంద్రబాబు ఆలోచన.

కానీ మీడియా సమావేశం మొదలుకాగానే జరిగింది ఇంకోటి. ప్రత్యేకహోదా విషయంలో మూడున్నరేళ్ళుగా చంద్రబాబు వేసిన పిల్లిమొగ్గలు, బిజెపితో అంటకాగిన విధానం, ఏపికి కేంద్రం నుండి ఎటువంటి సాయంరాదని అందరికీ తెలిసినా చంద్రబాబు మాత్రం మద్దతుగా నిలబడటం, చివరి నిముషంలో ఎన్డీఏ నుండి బయటకు వచ్చేయటం వల్ల సాధించబోయేదేమిటి? లాంటి అనేక ప్రశ్నలను సంధించింది.

ఒకవిధంగా చంద్రబాబుకు గుక్కతిప్పుకోకుండా ప్రశ్నలు వేయటంతో ఏం చెప్పాలో అర్ధం కాలేదు. రాష్ట్రంలో తనేం మాట్లాడినా బాకాలూదే మీడియా అనే అనుకున్నట్లున్నారు జాతీయ మీడియా అంటే. దాంతో చుక్కలు కనబడి చివరకు చేతులెత్తేసి మీడియా సమావేశం ముగించేశారు.

 

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos