నర్సరావుపేట: గుంటూరు జిల్లాలోని నర్సరావుపేట  ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డికి కరోనా సోకింది. దీంతో ఆయన ఆయన చికిత్స తీసుకొంటున్నారు.  రాష్ట్రంలోని పలువురు ప్రజా ప్రతినిధులు ఇప్పటికే కరోనా బారిన పడి కోలుకొంటున్నారు. గత వారం రోజుల క్రితం టీడీపీకి చెందిన మండపేట ఎమ్మెల్యే జోగేశ్వరరావుకు కరోనా సోకింది. తాజాగా నర్సరావుపేట ఎమ్మెల్యేకు కరోనా సోకింది.

also read:మండపేట ఎమ్మెల్యే జోగేశ్వరరావుకు కరోనా: హైద్రాబాద్‌లో చికిత్స

ఏపీలో ఇప్పటికే డిప్యూటీ సీఎం అంజద్ బాషాతో పాటు పలువురు ఎమ్మెల్యేలకు కరోనా సోకింది. విజయనగరం జిల్లా జిల్లా ఎస్.కోట ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసులు, గుంటూరు జిల్లా పొన్నూరు ఎమ్మెల్యే కిలారి రోశయ్య, నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య, కర్నూలు జిల్లా శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి, గుంటూరు జిల్లా తెనాలి ఎమ్మెల్యే శివకుమార్, చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం, ఏపీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి, ఈ నెల 6వ తేదీన అరకు ఎమ్మెల్యే ఫాల్గుణ కూడ  కరోనా బారినపడిన విషయం తెలిసిందే.

కడప జైల్లో ఉన్న మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డికి కరోనా సోకిన విషయం తెలిసిందే. సీఐను దూషించిన కేసులో జైలు నుండి మూడు రోజుల క్రితం ఆయన జైలు నుండి విడుదలయ్యారు.