మండపేట ఎమ్మెల్యే జోగేశ్వరరావుకు కరోనా: హైద్రాబాద్‌లో చికిత్స
తూర్పు గోదావరి జిల్లా మండపేట ఎమ్మెల్యే జోగేశ్వరరావుకు కరోనా సోకింది. ఈ విషయాన్ని వైద్యులు ప్రకటించారు. జోగేశ్వరరావు హైద్రాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
విజయవాడ: తూర్పు గోదావరి జిల్లా మండపేట ఎమ్మెల్యే జోగేశ్వరరావుకు కరోనా సోకింది. ఈ విషయాన్ని వైద్యులు ప్రకటించారు. జోగేశ్వరరావు హైద్రాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
ఏపీలో ఇప్పటికే డిప్యూటీ సీఎం అంజద్ బాషాతో పాటు పలువురు ఎమ్మెల్యేలకు కరోనా సోకింది. విజయనగరం జిల్లా ఎస్.కోట ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసులు, గుంటూరు జిల్లా పొన్నూరు ఎమ్మెల్యే కిలారి రోశయ్య, నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య, కర్నూలు జిల్లా శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి, గుంటూరు జిల్లా తెనాలి ఎమ్మెల్యే శివకుమార్, చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం, ఏపీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి, ఈ నెల 6వ తేదీన అరకు ఎమ్మెల్యే ఫాల్గుణ కూడ కరోనా బారినపడ్డారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పలువురు ప్రజా ప్రతినిధులు కరోనా బారినపడి కోలుకొన్నారు. తాజాగా మండపేట ఎమ్మెల్యే జోగేశ్వరరావు కూడ కరోనా బారిన పడ్డారు. దీంతో జోగేశ్వరరావు అభిమానులు, ఆ పార్టీ నేతలు కలవర పడుతున్నారు.
ఏపీలో 2,81,817 కరోనా కేసులు నమోదయ్యాయి. శనివారం నాడు ఏపీ రాష్ట్రంలో 8,732 కరోనా కేసులు రికార్డయ్యాయి. ఏపీలో 88,138 యాక్టివ్ కేసులు ఉన్నట్టుగా ఏపీ ప్రభుత్వం ప్రకటించింది.