తెలుగుదేశం నేతలను ముఖ్యమంత్రిచంద్రబాబు తొలిసారిగా ఎండలో తిప్పుతున్నాడు.  ప్రధాని మోదీ ఆంధ్రాకు చేసిన ద్రోహానికి నిరసనగా మంత్రులు,ఎంపిలు ఎండలు లేక్క చేయకుండాసైకిల్ యాత్రలు చేయాలని అధినేత పిలుపునిచ్చారు. నిజానికి ఆంధ్రలో బాగా ఎండలు మండుతున్నాయి. రాష్ట్రంలో ఉష్ణోగ్రత 40 డిగ్రీలకు సెల్సియస్ కు చేరుకుంది. చాలా చోట్ల వడదెబ్బలయ్యాయి. జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ చెబుతూ ఉంది. ఎండలు తట్టుకునేందుకు ఏమిచేయాలో విపత్తుల శాఖ సలహాలు కూడా ఇచ్చింది. ఇలాంటపుడు ముఖ్యమంత్రి పిలుపు మేరకు పురపాలక శాఖ మంత్రి నారాయణ సైకిల్ తొక్కారు. ప్రధాని మోదీ చేసిన అన్యాయన్ని ఖండించారు ఇలా. నేడు నెల్లూరు టెంపరేచర్ 40డి.సె.