నారా లోకేష్ సంచలన ట్వీట్

టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేష్ మరోసారి సంచలన ఆరోపణలు చేశారు. ట్వీటర్ వేదికగా ఎపీ సీఎం జగన్‌పై విరుచుకుపడ్డారు. ఎన్నికల ప్రచారంలో జగన్ అనే నేను అంటూ ఇచ్చిన మాటలు కోటలు దాటాయని..పనులు మాత్రం గడపకూడా దాటడం లేదని విమర్శించారు

Nara Lokesh Slams At Jagan Mohan Reddy Govt On agri gold scam

టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేష్ మరోసారి సంచలన ట్వీట్ చేశారు. ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డిని ఉద్దేశించి తీవ్ర ఆరోపణలు చేశారు. "జగన్ అనే నేను అంటూ కోతల రాయుడుగారు ఎన్నికల ముందు ఏమేం కోతలు కోశారు, అధికారంలోకి వచ్చాక ఇచ్చిన హామీలను ఎలా కోతలకు గురి చేస్తున్నారో చూడండి. అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోపే, అగ్రిగోల్డ్ బాధితులకు రూ.1100 కోట్లు ఇస్తామని ఆనాడు చెప్పారు.  మరిప్పుడు ఐదు నెలల తర్వాత రూ.264 కోట్లు మాత్రమే ఇస్తామంటారేంటి? అంటే కోతకు గురైన రూ.836 కోట్లను ఇంకో నెలలో ఇచ్చేసి మాట నిలబెట్టుకుంటారా? అయినా తెదేపా హయాంలోనే 6.49 లక్షల మందికి, రూ.336 కోట్లు ఇచ్చేందుకు సిద్ధం చేసాం" అంటూ ట్విటర్ వేదికగా ఆరోపించారు. 

ఆస్తుల కేసు: వైఎస్ జగన్ కోర్టు హాజరుకు అయ్యే ఖర్చు ఎంతో తెలుసా?

ఎన్నికల్లో  తెలుగుదేశం ఓటమి తర్వాత నారా లోకేశ్ ఆక్టివ్‌గా మారారు. ట్విటర్ ద్వారా జగన్‌ను టార్గెట్ చేస్తూ వస్తున్నారు.   ఏపీలో జరుగుతున్న పరిణామాలపై ప్రభుత్వాన్ని, వైఎస్ జగన్‌ను ట్విట్టర్ వేదికగా లోకేష్ ప్రశ్నిస్తున్నారు. గతంలో కూడా లోకేశ్ జగన్‌పై తీవ్ర స్ధాయిలో మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు  జగన్ ఫెయిల్డ్ సీఎం అంటూ హ్యాష్ ట్యాగ్‌తో ట్విటర్‌లో కాంపైనింగ్ మెుదలు పెట్టారు. అంతేకాదు ట్వీట్‌లను సీఎం జగన్ కు సైతం ట్యాగ్ చేశారు నారా లోకేష్.

అచ్చం పవన్ చెప్పినట్లే: సీఎం జగన్ కు జనసేన ఎమ్మెల్యే రాపాక పాలాభిషేకం

నిరుద్యోగులపై సీఎం జగన్ కు కక్ష పెంచుకున్నారంటూ విమర్శించారు. వారిపై ఎందుకు అంత కక్షో జగన్ సమాధానం చెప్పాలని నిలదీశారు. ఉద్యోగాలు ఇవ్వమని అడిగితే వాళ్లపైనా కేసులు పెడతారా...? సిగ్గులేదా ఏపీ ప్రభుత్వంపై మండి పడ్డారు. 

గ్రామవాలంటీర్ పేరుతో వైసీపీ కార్యకర్తలకే ఉద్యోగాలు ఇచ్చుకున్నారని ఆరోపించారు. సచివాలయ పరీక్షా పత్రాలు లీక్ చేసి  20లక్షల మంది నిరుద్యోగులను నట్టేట ముంచారని జగన్‌పై విరుచుకుపడ్డారు. జగన్ తన పాదయాత్ర సమయంలో కోటి 70 లక్షల మందికి ఉద్యోగాలిచ్చి యువతను ఉద్ధరించేస్తానని హామీ ఇచ్చి  ఇప్పుడు  దాన్ని మరిచిపోయారని  ధ్వజమెత్తారు. ఉద్యోగాలు ఇచ్చేస్తామంటూ ప్రగల్భాలు పలికిన జగన్  ఇప్పుడు ఉద్యోగాలు ఎవని  అడిగినందుకు వారిపై కేసులు పెడుతున్నారంటూ తిట్టిపోశారు. 

 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios