తూర్పు గోదావరి జిల్లా అనపర్తి మండలకేంద్రానికి చెందిన ఓ మైనర్ బాలిక 55ఏళ్ల వృద్దుడి చేతిలో అత్యాచారానికి గురయ్యింది. మనవరాలి వయసున్న బాలికపై కన్నేసిన సత్యనారాయణ రెడ్డి అనే వృద్దుడు నిన్న(గురువారం) బాలిక ఒంటరిగా వుండగా మాయమాటలు చెప్పి ఇంట్లోకి తీసుకెళ్ళి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. లైంగిక దాడి కారణంగా బాలికకు తీవ్ర రక్తస్రావమై హాస్పిటల్ లో చికిత్స పొందుతోంది. ఈ దుర్ఘటనపై మాజీ మంత్రి, టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సీరియస్ అయ్యారు. 

read more మనవరాలి వయసు బాలికపై వృద్దుడి అత్యాచారం... తీవ్ర రక్తస్రావంతో ఆస్పత్రి పాలు

''దిశ చట్టం నిద్రపోతుందా వైఎస్ జగన్ గారు. తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో 9 ఏళ్ల బాలిక అత్యాచారానికి గురయ్యింది. చిన్నారిని చిదిమేసిన మృగాడు సత్యనారాయణ రెడ్డిని కఠినంగా శిక్షించాల్సింది పోయి, స్థానిక వైకాపా నేతలు రాజీ కుదిర్చే ప్రయత్నం చెయ్యడం దారుణం'' అంటూ లోకేష్ ట్వీట్ చేశారు. 

''చిన్నారిపై అత్యాచారానికి పాల్పడిన వ్యక్తిని కఠినంగా శిక్షించాలి. రాష్ట్రంలో మహిళలకు అసలు రక్షణ ఉందా? 21 రోజుల్లో న్యాయం ఎక్కడ? ప్రచార ఆర్భాటంతో మొదటి దిశ పోలీస్ స్టేషన్ ప్రారంభించిన జిల్లాలోనే ఘోరాలు జరుగుతుంటే ఇక మిగిలిన చోట్ల ఎంత దారుణమైన పరిస్థితి ఉందో అర్ధమవుతుంది'' అంటూ లోకేష్ ఆందోళన వ్యక్తం చేశారు.