Asianet News TeluguAsianet News Telugu

జగన్ రెడ్డికి వచ్చిన ఆ కష్టం పగవాడికి కూడా రాకూడదు: నారా లోకేష్

 స్టేట్స్ బిజినెస్ రీఫార్మ్స్ యాక్షన్ ప్లాన్ 2019 ర్యాంకులను కేంద్ర ప్రభుత్వం శనివారం విడుదల చేయగా అందులో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో ఏపీకి మొదటి స్థానం లభించింది. 

nara lokesh satires on cm jagan over ease of doing business rankings
Author
Guntur, First Published Sep 6, 2020, 1:21 PM IST

గుంటూరు: స్టేట్స్ బిజినెస్ రీఫార్మ్స్ యాక్షన్ ప్లాన్ 2019 ర్యాంకులను కేంద్ర ప్రభుత్వం శనివారం విడుదల చేయగా అందులో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో ఏపీకి మొదటి స్థానం లభించింది.  దీంతో వైసిపి ఇది ముఖ్యమంత్రి జగన్ అతితక్కువ పాలనా కాలంలోనే సాధించిన ఘనత అంటూ కొనియాడుతున్నారు. దీనిపై తాజాగా టిడిపి జాతీయ కార్యదర్శి నారా లోకేష్ కొంత ఘాటు మరికొంత వ్యంగ్యాన్ని జోడించి సోషల్ మీడియా వేదికన స్పందించారు.  

''జగన్ రెడ్డి గారికి వచ్చిన కష్టం పగవాడికి కూడా రాకూడదు.చంద్రబాబు గారి పాలనలో ఏపీ కి ఈజ్ అఫ్ డూయింగ్ బిజినెస్ లో నెంబర్ 1 ఇచ్చిన బుద్ది, జ్ఞ్యానం లేని వాడు ఎవడు?అని నోరుపారేసుకున్నారు జగన్'' అంటూ గతంలో జగన్ వ్యాఖ్యలను గుర్తుచేశారు. 

 

''ఇప్పుడు అదే నోటితో వైకాపా పాలనలో వచ్చిన ర్యాంకింగ్ కాకపోయినా తన పనితనం చూసే ఏపీకి ఈజ్ అఫ్ డూయింగ్ బిజినెస్ లో నెంబర్ 1 ఇచ్చారని, తాటికాయంత అక్షరాలతో సొంత మీడియా లో పబ్లిసిటీ చేసుకునే పరిస్థితి వచ్చింది'' అని అన్నారు. 

''చంద్రబాబు గారి హయాంలో ఒక్క పరిశ్రమ,ఒక్క ఉద్యోగం రాలేదు అన్న జగన్ తోనే టిడిపి పాలనలో 39,450 పరిశ్రమలు, వాటి ద్వారా 5,13,351 ఉద్యోగాలు, ఐటీ శాఖ ద్వారా 30,428 ఉద్యోగాలు వచ్చాయి. అడ్వాన్స్ స్టేజ్ లో ఉన్న 137 కంపెనీల ద్వారా 2,78,586 ఉద్యోగాలు రాబోతున్నాయి అని నిజం చెప్పించాడు ఆ దేవుడు'' అంటూ నారా లోకేష్ వరుస ట్వీట్ల ద్వారా వైసిపి ప్రభుత్వాన్ని, సీఎం జగన్ ని విమర్శించారు. 

read more   సీఎం గారూ...అంత:కరణ శుద్దితో అంటే ఇలాగేనా?: నిలదీసిన యనమల

ఇక దేశ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పియూష్ గోయల్, మరో కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి విడుదల చేసిన ఈ ర్యాంకింగ్స్ లో ఏపీ తర్వాత ఉత్తరప్రదేశ్ రెండో స్థానాన్ని, తెలంగాణ మూడవ స్థానాన్ని  దక్కించుకున్నాయి. అంతకుముందు 2018 సంవత్సరంలో ఇటువంటి ర్యాంకింగ్ విడుదలైంది.

దేశీయ మరియు ప్రపంచ స్థాయి పెట్టుబడిదారులను ఆకర్షించడానికి, వ్యాపార వాతావరణాన్ని మెరుగుపరచడానికి రాష్ట్రాల మధ్య పోటీని సృష్టించడానికి ఈజ్ ఆఫ్ డూయింగ్  బిజినెస్ పేరుతో రాష్ట్రాల ర్యాంకింగ్‌ను కేంద్ర ప్రభుత్వం విడుదల చేస్తుంది. 


 

Follow Us:
Download App:
  • android
  • ios